వనాల్లో మొక్కలను పెం చాలి

ABN , First Publish Date - 2022-12-15T22:40:15+05:30 IST

పంచాయతీల్లో చేపడు తున్న బృహత్‌ పల్లె ప్రకృతి వనాల్లో మొక్కలను పెం చాలని కలెక్టర్‌ భారతి హోళికేరీ అధికారులకు సూ చించారు. గురువారం పల్లంగూడ పంచాయతీలోని గోండుగూడలో ఏర్పాటు చేసిన బృహత్‌ పల్లె ప్రకృతి వనాన్ని ఆమె పరిశీలించారు

వనాల్లో మొక్కలను పెం చాలి

కాసిపేట, డిసెంబరు 15: పంచాయతీల్లో చేపడు తున్న బృహత్‌ పల్లె ప్రకృతి వనాల్లో మొక్కలను పెం చాలని కలెక్టర్‌ భారతి హోళికేరీ అధికారులకు సూ చించారు. గురువారం పల్లంగూడ పంచాయతీలోని గోండుగూడలో ఏర్పాటు చేసిన బృహత్‌ పల్లె ప్రకృతి వనాన్ని ఆమె పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ బృహత్‌ పల్లె ప్రకృతి వనాలను ఆహ్లాదకరంగా తీర్చి దిద్దాలన్నారు. అటవీ మొక్కలు పెంచి అటవీ అధి కారులకు అప్పగిస్తే సామాజిక అడవుల విస్తీర్ణం పెరు గుతుందన్నారు. అలాగే వాకింగ్‌ ట్రాక్‌లను శుభ్రంగా ఉంచాలని సూచించారు. నర్సరీల్లో మొక్కలు చనిపోతే కొత్త మొక్కలు నాటాలని పేర్కొన్నారు. నర్సరీల్లోని మొక్కలు హరితహారం నాటికి అందుబాటులో వచ్చే లా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. నర్సరీలు, ప్రకృతి వనాల నిర్వహణలో నిర్లక్ష్యం చేయవద్దన్నారు. ఎంపీడీవో ఆలీం, ఏపీవో నవీన్‌, ఈజీఎస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2022-12-15T22:40:19+05:30 IST