పెండింగ్‌లో బిల్లులు విడుదల చేయాలి

ABN , First Publish Date - 2022-11-23T22:36:58+05:30 IST

పెండింగ్‌లో ఉన్న గ్రామ పంచాయ తీల బిల్లులను విడుదల చేసి సర్పంచ్‌ల సమస్యలను పరిష్కరించాలని సర్పం చ్‌ల సంఘం జిల్లా అధ్యక్షుడు సాపాట్‌ శంకర్‌ పేర్కొన్నారు.

పెండింగ్‌లో బిల్లులు విడుదల చేయాలి

మంచిర్యాల కలెక్టరేట్‌, నవంబరు 23: పెండింగ్‌లో ఉన్న గ్రామ పంచాయ తీల బిల్లులను విడుదల చేసి సర్పంచ్‌ల సమస్యలను పరిష్కరించాలని సర్పం చ్‌ల సంఘం జిల్లా అధ్యక్షుడు సాపాట్‌ శంకర్‌ పేర్కొన్నారు. సమస్యలను పరి ష్కరించాలని ఐబీ నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీ నిర్వహించి వినతిపత్రం సమ ర్పించారు. ఆయన మాట్లాడుతూ 14, 15వ ఫైనాన్స్‌కు సంబంధించిన నిధుల ను విడుదల చేయాలని, సర్పంచ్‌లు బిల్లులు రాక అనేక ఇబ్బందుల పాలవుతు న్నారన్నారు. పని భారాన్ని సర్పంచ్‌లపై మోపుతూ ఒత్తిడికి గురి చేస్తూ అధికా రులు ఇబ్బంది పెడుతున్నారని, పెట్టిన డబ్బులు రాక అప్పుల ఊబిలో కూరుకు పోయారన్నారు. 9 మాసాలుగా బిల్లులు రావడం లేదని, అప్పు చేసి గ్రామ అభి వృద్ధికి వెచ్చించాల్సి వస్తుందన్నారు. ట్రెజరీలో పెండింగ్‌లో ఉన్నాయని అధికారు లు చెబుతున్నారని, పని భారం తగ్గిస్తూ నిధులను విడుదల చేయాలని డిమాం డ్‌ చేశారు. రాష్ట్ర సర్పంచ్‌ల సంఘం అధికార ప్రతినిధి బాపు, సంఘం నాయ కులు కళావతి దేవి, సునీత, విజయలక్ష్మి, వేముల కృష్ణ, రాంటెంకి శ్రీనివాస్‌, సుజాత, సునీత, రజిత, లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-23T22:37:02+05:30 IST