వీఆర్‌ఏలకు పే స్కేల్‌ అమలు చేయాలి

ABN , First Publish Date - 2022-08-20T03:38:34+05:30 IST

వీఆర్‌ఏల సమస్యలు పరిష్కరించి పే స్కేల్‌ విడుదల చేయాలని వీఆర్‌ఏల జిల్లా చైర్మన్‌ ఓంకార్‌ డిమాండ్‌ చేశారు. శుక్రవారం బాయ్స్‌ హైస్కూల్‌ నుంచి కలెక్టరేట్‌ వరకు బతుకమ్మలు, పోతురాజు లతో వినూత్న నిరసన ర్యాలీ చేపట్టి కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. వీఆర్‌ఏలకు పే స్కేల్‌ అమలు చేసి పదోన్నతులు కల్పించాలని డిమాండ్‌ చేశా రు. 55 సంవత్సరాల వీఆర్‌ఏలకు రిటైర్డ్‌మెంట్‌ కల్పించి వారసులకు ఉద్యోగం ఇవ్వాలన్నారు.

వీఆర్‌ఏలకు పే స్కేల్‌ అమలు చేయాలి
జిల్లా కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహిస్తున్న వీఆర్‌ఏల సంఘం నాయకులు

మంచిర్యాల కలెక్టరేట్‌, ఆగస్టు 19:  వీఆర్‌ఏల సమస్యలు పరిష్కరించి  పే స్కేల్‌ విడుదల చేయాలని వీఆర్‌ఏల జిల్లా చైర్మన్‌ ఓంకార్‌ డిమాండ్‌ చేశారు. శుక్రవారం బాయ్స్‌ హైస్కూల్‌ నుంచి కలెక్టరేట్‌ వరకు బతుకమ్మలు, పోతురాజు లతో వినూత్న నిరసన ర్యాలీ చేపట్టి కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు.  వీఆర్‌ఏలకు పే స్కేల్‌ అమలు  చేసి పదోన్నతులు కల్పించాలని డిమాండ్‌ చేశా రు. 55 సంవత్సరాల వీఆర్‌ఏలకు రిటైర్డ్‌మెంట్‌ కల్పించి వారసులకు ఉద్యోగం ఇవ్వాలన్నారు. జేఏసీ నాయకులు గణపతి, శ్రీనివాస్‌, పర్వతాలు, జనార్దన్‌, కమలాకర్‌, రత్నం, ప్రదీప్‌, శ్రీనివాస్‌, రాజశేఖర్‌, శ్రీదేవి, రాణి పాల్గొన్నారు.  

వీఆర్‌ఏల ప్రదర్శనకు సీఐటీయూ నాయకులు పాల్గొని మద్దతు ప్రకటించారు.  జిల్లా కార్యదర్శి ప్రదీప్‌కుమార్‌, నాయకులు కుమార్‌, రాము పాల్గొన్నారు.  

 

Updated Date - 2022-08-20T03:38:34+05:30 IST