మద్యం మత్తులో పురుగుల మందు తాగి ఒకరి మృతి
ABN , First Publish Date - 2022-10-07T06:08:53+05:30 IST
మండలంలోని ఘన్‌పూర్ గ్రామానికి చెందిన ఆడేజ్ఞానేశ్వర్ (36) అనే వ్యక్తి గురువారం మద్యం మత్తులో పురుగుల మందు తాగి మృతి చెందినట్లు ఎస్సై రవీందర్ తెలిపారు.
బోథ్,అక్టోబరు6: మండలంలోని ఘన్‌పూర్ గ్రామానికి చెందిన ఆడేజ్ఞానేశ్వర్ (36) అనే వ్యక్తి గురువారం మద్యం మత్తులో పురుగుల మందు తాగి మృతి చెందినట్లు ఎస్సై రవీందర్ తెలిపారు. ఆయన తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. జ్ఞానేశ్వర్ కొన్నేళ్లుగా మద్యానికి బానిసయ్యాడు. తరచూ భార్యను వేధించేవాడు. గురువారం ఉదయం మద్యం తాగి వచ్చి భార్యతో గొడవకు దిగాడు. దీంతో భార్య ఇంటి నుంచి బయటకు వెళ్లింది. ఆ తర్వాత కొద్ది సేపటికి వచ్చేసరికి జ్ఞానేశ్వర్ అపస్మారక స్థితిలోపడి ఉండడాన్ని గమనించింది. పక్కనే పురుగుల మందు డబ్బా ఉండడంతో వెంటనే బోథ్ ఆసుపత్రికి ఆటోలో తరలించగా మార్గమధ్యలో మృతి చెందినట్లు ఎస్సై వివరించారు. అతడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.