కన్నుల పండువగా జిల్లాలో నవరాత్రి ఉత్సవాలు

ABN , First Publish Date - 2022-10-01T06:40:15+05:30 IST

జిల్లాలో దేవీ శరన్నవ రాత్రి ఉత్సవాలు కన్నుల పండువగా కొనసాగుతున్నాయి. ఊరూవాడ దుర్గామాత, శారదదేవి విగ్రహాలను ప్రతిష్ఠించగా మండపాల వద్ద వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలను భక్తి ప్రప త్తులతో చేపడుతున్నారు. పట్టణం లోని ఆయా కాలనీలలో

కన్నుల పండువగా జిల్లాలో నవరాత్రి ఉత్సవాలు
బొజ్జవార్‌ ఆలయంలో పూజలు చేస్తున్న దృశ్యం

ఆదిలాబాద్‌ అర్బన్‌, సెప్టెంబరు 30: జిల్లాలో దేవీ శరన్నవ రాత్రి ఉత్సవాలు కన్నుల పండువగా కొనసాగుతున్నాయి. ఊరూవాడ దుర్గామాత, శారదదేవి విగ్రహాలను ప్రతిష్ఠించగా మండపాల వద్ద వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలను భక్తి ప్రప త్తులతో చేపడుతున్నారు. పట్టణం లోని ఆయా కాలనీలలో ప్రతిష్టించిన అమ్మవారి మండపాల వద్ద శుక్రవారం కుంకుమా ర్చన కార్యక్రమాలను చేపట్టడంతో ఆధ్యాత్మిక శోభ సంతరించు కుంది. పట్టనంలో ప్రసిద్ధ బొజ్జవార్‌ ఆలయంలో ప్రతిష్ఠించిన దుర్గాదేవి మండపం వద్ద కుంకుమార్చనలు చేశారు. వేద పం డితులు ఫనతుల ప్రవీణ్‌శర్మ మంత్రోచ్ఛరణల మధ్య శాస్ర్తోక్తం గా మహిళలు పూజలు చేపట్టారు. అలాగే, పట్టణంలోని కొలి పురలో గల ఖత్రి సమాజ్‌ భవనంలోను నవరాత్రి ఉత్సవాలను వైభవోపేతంగా జరుపుతున్నారు. దీనిలో భాగంగా మహిళలు పెద్దఎత్తున కుంకుమార్చనల్లో పాల్గొన్నారు. స్థానిక రిక్షానగ ర్‌లో ప్రతిష్ఠించిన శారద దేవి మండపం వద్ద సైతం  మహిళ లు కుంకుమార్చనలు చేశారు. అలాగే, జిల్లాలోని నేరడిగొండ మండలం బుగ్గారంలో రిమ్స్‌ డైరెక్టర్‌ రాథోడ్‌ జైసింగ్‌ కుటుంబ సమేతంగా దుర్గాదేవికి పూజలు చేశారు. అలాగే, బోథ్‌, తాంసి, తలమడుగు, సిరికొండ, ఇంద్రవెల్లితో పాటు ఆయా మండలం లో  దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి.

Read more