జాతీయ పతాకకీర్తిని నలుదిక్కుల చాటాలి : మంత్రి అల్లోల
ABN , First Publish Date - 2022-08-12T07:34:10+05:30 IST
జాతీయ పతాక కీర్తిని నలుదిక్కులా చూటాలని అటవీ, పర్యావరణ, న్యాయ దేవాదాయ శాఖల మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.

నిర్మల్ చైన్‌గేట్, ఆగస్టు 11 : జాతీయ పతాక కీర్తిని నలుదిక్కులా చూటాలని అటవీ, పర్యావరణ, న్యాయ దేవాదాయ శాఖల మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. స్వతంత్య్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకొని గురువారం శ్యాంఘడ్ కోట నుంచి ఎన్టిఆర్ స్టేడియం వరకు నిర్వహించిన ఫ్రీడం రన్లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరిలో దేశభక్తి భావనను పెంపొందించేందుకు స్వతంత్య్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకొని 15 రోజుల పాటు ద్విసప్తాహా వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని అన్నారు. స్వాతంత్య్ర పోరాట స్పూర్తిని ప్రజలందరిలో మేలుకొలిపేలా పాఠశాల విద్యార్థులు మొదలుకొని ఉద్యోగులు, ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు, యువతీ యువకులను స్వతంత్య్ర భారత వజ్రోత్సవాల్లో భాగస్వాములను చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దండే విఠల్, కలెక్టర్ ముషారఫ్ ఆలీ ఫారూఖీ, అదనపు కలెక్టర్ రాంబాబు, హేమంత్ బొర్కడే, డీఎస్పీ జీవన్ రెడ్డి, ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి, టిఆర్ఎస్ నాయకులు పాకాల రాంచంధర్ తదితరులు పాల్గొన్నారు.
పిల్లలతో కలిసి గాంధీ సినిమాను వీక్షించిన మంత్రి అల్లోల
నిర్మల్ చైన్‌గేట్, ఆగస్టు 11 : విద్యార్థులు చిన్ననాటి నుంచే స్వాతంత్య్ర పోరాటస్పూర్తిని అలవర్చుకోవాలని అటవీ, పర్యావరణ, న్యాయశాఖల మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. స్వతంత్య్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా గురువారం పట్టణంలోని తిరుమల థియేటర్లో ప్రదర్శిస్తున్న గాంధీ చిత్రాన్ని విద్యార్థులతో కలిసి మంత్రి వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు, ప్రజల్లో దేశభక్తి నింపేలా గాంధీ సినిమాను ప్రదర్శిస్తున్నామన్నారు. ఈ సినిమాను ప్రతీ ఒక్కవిద్యార్థి చూసి స్వాతంత్య్ర పోరాట స్పూర్తి పొందాలనేది సీఎం కేసీఆర్ అభిమతమన్నారు. శాంతి, అహింసతో స్వాతంత్య్రం సిద్ధించిందని, శాంతియుత పద్దతుల్లో హ క్కులను సాధించుకోగలమని నేటి పౌరులకు తెలియజేప్పే బాధ్యత మనందరిపై ఉందన్నారు. జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఆలీ ఫారూఖీ, అదనపు కలెక్టర్లు హేమంత్ బొర్కడే, రాంబాబు, ప్రముఖ వ్యాపారవేత్త అల్లోల మురళీధర్ రెడ్డి, టిఆర్ఎస్ నాయకులు పాకాల రాంచందర్‌తో పాటు పాల్గొన్నారు.
స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ప్రీడమ్ రన్
నర్సాపూర్(జి), ఆగస్టు 11 : 75 సంవత్సరాల స్వాతంత్య్ర వేడుకలను పుర స్కరించుకొని స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ఫ్రీడమ్రన్ను గురువారం మండల కేంద్రం నుంచి రాంపూర్ వరకు దాదాపు రెండు కిలో మీటర్లు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీకాంత్, ఎస్సై పాకాల గీత, సర్పంచ్ అర్గుమీది రామిరెడ్డి, ఎంపీడీవో ఉషారాణి, అంగన్వాడీ కార్యకర్తలు, యూత్ నాయకులు పాల్గొన్నారు.
ఖానాపూర్ : పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన 2కే రన్‌కు విశేషస్పందన వచ్చింది. ఈ సందర్భంగా పట్టణంలోని శ్రీరామ్‌నగర్ కాలనీ నుంచి సాయి బాబా మందిరం వరకు 2కే రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్య క్రమాన్ని ఖానాపూర్ సీఐ అజయ్‌బాబు ప్రారంభించారు.