మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తేనే దేశాభివృద్ధి

ABN , First Publish Date - 2022-03-06T03:50:28+05:30 IST

మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తేనే దేశం అభివృద్ధి చెందుతుందని ఎంపీపీ గడ్డం శ్రీనివాస్‌ అన్నారు. ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని ప్రాథమిక పాఠశాల ఆవరణలో శనివారం విద్యార్థినులకు వ్యాసరచన, ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఎంపీపీ మాట్లాడుతూ విద్య అనేది ఎంతో అవసరమని, మహిళలు చదువుకున్నప్పుడే కుటుంబాలు ఆర్థికంగా బాగుంటాయన్నారు.

మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తేనే దేశాభివృద్ధి
దండేపల్లిలో సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీపీ గడ్డం శ్రీనివాస్‌

దండేపల్లి, మార్చి 5: మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తేనే దేశం అభివృద్ధి చెందుతుందని ఎంపీపీ గడ్డం శ్రీనివాస్‌ అన్నారు. ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని ప్రాథమిక పాఠశాల ఆవరణలో శనివారం విద్యార్థినులకు వ్యాసరచన, ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఎంపీపీ మాట్లాడుతూ విద్య అనేది ఎంతో అవసరమని, మహిళలు చదువుకున్నప్పుడే కుటుంబాలు ఆర్థికంగా బాగుంటాయన్నారు. ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ పోన్నం వాణి మాట్లాడుతూ సమాజంలో మహిళలపై ఉన్న వివక్షను రూపుమాపాలన్నారు.  అనంతరం పోటీలో గెలుపొందిన విద్యార్థులు, అంగన్‌వాడీ టీచర్లకు బహుమతులను ప్రదానం చేశారు. ఉప సర్పంచు గోట్ల భూమన్నయాదవ్‌, పీఏసీఎస్‌ డైరెక్టర్‌ గాండ్ల నరేష్‌, హెచ్‌ఎం అక్కల మల్లేశం,  పాల్గొన్నారు. 

  

Read more