కళలతోనే సమాజంలో నైతిక విలువలు
ABN , First Publish Date - 2022-06-05T04:57:36+05:30 IST
కళలు సమాజంలో నైతిక విలువలు, మానవ సంబంధాలపై అవగాహన కల్పించేందుకు దోహదపడతాయని కలెక్టర్ భారతి హోళికేరి పేర్కొన్నారు
మంచిర్యాల కలెక్టరేట్, జూన్ 4: కళలు సమాజంలో నైతిక విలువలు, మానవ సంబంధాలపై అవగాహన కల్పించేందుకు దోహదపడతాయని కలెక్టర్ భారతి హోళికేరి పేర్కొన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఎఫ్‌సీఏ ఫంక్షన్‌హాలులో నిర్వహించిన శ్రీశ్రీ కళావేదిక ప్రపంచ రంగ స్థలం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై నాట్య ప్రదర్శనను తిలకించారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి అవార్డులు, సన్మాన పత్రాలతో సన్మానించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా లో కళాకారులకు కొదువ లేదని, జాతీయ అంతర్జాతీ య స్ధాయిలో రాణిస్తున్నారన్నారు. కళాకారులకు ప్రభుత్వ సహకారం ఎప్పుడు ఉంటుందని తెలిపారు. ఈ ప్రదర్శనకు పలు రాష్ట్రాల నుంచి వెయ్యి మంది కళాకారులు పాల్గొన్నారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమం 24 గంటల 24 నిమి షాల 24 సెకన్ల నాన్‌స్టాప్ ప్రదర్శనతో రికార్డు నెల కొల్పి గుర్తింపు సాధించాలన్నారు. కళాకారుల అవా ర్డుల నిమిత్తం రూ.2 లక్షల విరాళం అందజేసిన అం జని పుత్ర సంస్థ చైర్మన్ గుర్రాల శ్రీధర్‌ను అభినందిం చారు. ఎమ్మెల్యే దివాకర్‌రావు మాట్లా డుతూ కళలతోనే సమాజ అభివృద్ధి, ప్రజల్లో చైతన్యానికి ఎంతగానో దోహదం చేస్తాయని, కళాకారులను గౌరవించాలన్నారు. 200 మంది కళాకారులు పాల్గొని ప్రదర్శనలు ఇచ్చారు. ప్రదర్శనలు ఆదివారం ముగియనున్నాయి. శ్రీశ్రీ రంగస్థలం సంస్థ జాతీయ చైర్మన్ ప్రతాప్, రాష్ట్ర కోఆర్డినేటర్ భాగ్యలక్ష్మీ, మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ, సంస్థ సమన్వయకర్తలు గుండేటి యోగేశ్వర్, రాంప్రకాష్, రమావతి, నరేంద్ర, భరత్, పిల్లి రవి, సంతోష్, గడికొప్పుల తిరుపతి, సూరినేని కిషన్, మహేందర్ పాల్గొన్నారు.