Slippery mouth: మరోసారి నోరుజారిన ఎమ్మెల్యే వనమా
ABN , First Publish Date - 2022-08-14T18:37:27+05:30 IST
భద్రాద్రి జిల్లా కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు(MLA Vanama Venkateswara Rao) మరోసారి నోరు జారారు. స్వాతంత్య్ర

- 75ఏళ్ల క్రితం కేసీఆర్ పిలుపు మేరకు దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని వ్యాఖ్య
- సామాజిక మాధ్యమాల్లో హాట్‌టాపిక్‌గా మారిన ఎమ్మెల్యే ప్రసంగం
పాల్వంచ(భద్రాద్రి కొత్తగూడెం), ఆగస్టు 13: భద్రాద్రి జిల్లా కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు(MLA Vanama Venkateswara Rao) మరోసారి నోరు జారారు. స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా పాల్వంచ పట్టణంలో నిర్వహిస్తున్న ర్యాలీలో మరోసారి నోరు జారి విమర్శల పాలయ్యారు. ర్యాలీ సందర్భంగా అంబేద్కర్ సెంటర్లో మాట్లాడుతూ కేసీఆర్ పిలుపు మేరకు 75 సం వత్సరాల క్రితం భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిందని తన ప్రసంగంలో వ్యాఖ్యానించడం తీవ్ర చర్చనీయాంశమైంది. వనమా ప్రసంగంలోని ఈ వ్యాఖలు శనివారం సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. ఎమ్మెల్యే వ్యాఖ్యలు సరికావని కొందరు, స్వాతంత్య్ర పోరాటంలో ప్రాణత్యాగాలు చేసిన వారిని అవమానించేలా ఎమ్మెల్యే మాటలు ఉన్నాయని మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం భద్రాద్రి జిల్లా ఈ వ్యవహారం హాట్ టాఫిక్‌గా మారింది.