అప్రకటిత విద్యుత్‌ కోతలపై సభ్యుల ధ్వజం

ABN , First Publish Date - 2022-08-26T03:37:47+05:30 IST

అప్రకటిత విద్యుత్‌ కోతలతో ప్రజ లు ఇబ్బందులు పడుతున్నారని సభ్యులు ధ్వజమెత్తారు. ఎంపీపీ మందపల్లి స్వర్ణలత అధ్యక్షతన ఎంపీడీవో కార్యాల యంలో గురువారం మండల సమావేశం జరిగింది. వ్యవ సాయాధికారి మార్గం రజిత వ్యవసాయాభివృద్ధి గురించి వివరించారు. మన ఊరు మన బడి పనులను ఎంఈవో పోచయ్య వివరించగా కొత్తపల్లి ప్రభుత్వ పాఠశాల శిథిలా వస్థలో ఉందని, వెంటనే నిర్మించాలని ఎంఈవోను వేంపల్లి సర్పంచ్‌ శారద కోరారు.

అప్రకటిత విద్యుత్‌ కోతలపై సభ్యుల ధ్వజం
సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీపీ మందపల్లి స్వర్ణలత

హాజీపూర్‌, ఆగస్టు 25 : అప్రకటిత విద్యుత్‌ కోతలతో ప్రజ లు ఇబ్బందులు పడుతున్నారని సభ్యులు ధ్వజమెత్తారు.  ఎంపీపీ మందపల్లి స్వర్ణలత అధ్యక్షతన ఎంపీడీవో కార్యాల యంలో గురువారం మండల సమావేశం జరిగింది. వ్యవ సాయాధికారి మార్గం రజిత వ్యవసాయాభివృద్ధి గురించి వివరించారు. మన ఊరు మన బడి పనులను ఎంఈవో పోచయ్య వివరించగా కొత్తపల్లి ప్రభుత్వ పాఠశాల శిథిలా వస్థలో ఉందని, వెంటనే నిర్మించాలని ఎంఈవోను వేంపల్లి సర్పంచ్‌ శారద కోరారు.  పడ్తన్‌పల్లి సర్పంచు శ్రీనివాస్‌, వేం పల్లి ఎంపీటీసీ డేగ బాపులు మాట్లాడుతూ  గ్రామాల్లో చిన్న పాటి వర్షం, గాలి వీచినా విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నారని, రోజులో 20సార్లు కరెంటు కట్‌ చేస్తున్నారని తెలిపారు.  ముల్కల, వేంపల్లి గ్రామాల్లో విద్యుత్‌ సమస్య తీవ్రంగా ఉందని తెలిపారు. ఎంపీటీసీ వెంకటేష్‌, సర్పంచులు మధుసూదన్‌రెడ్డి, లక్ష్మీలు మాట్లాడుతూ కడెం కెనాల్‌కు సం బంధించి కాలువ భూములను స్వాధీనం చేసుకుని కొందరు రైతుబంధు పొందుతున్నారని, కాలువ భూములపైనే ఇండ్లు నిర్మిస్తున్నారని, రెవెన్యూ అధికారులకు చెప్పినా పట్టించుకోవ డం లేదన్నారు. కడెం ఇరిగేషన్‌ ఏఈ అశ్విన్‌ మాట్లాడుతూ రెవెన్యూ అధికారులతో సర్వే చేయించి కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. గత సమావేశంలో చర్చించిన సమస్యలు పరిష్కారం కాలేదని ఎంపీటీసీ డేగ బాపు అన్నారు.  ఎంపీపీ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకా లను అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ప్రజలకు అందేలా చూడాలన్నారు. మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పల్లె భూమేష్‌, వైస్‌ ఎంపీపీ రమాదేవి, జెడ్పీ కో ఆప్షన్‌ నయీం పాషా, జడ్పీటీసీ శిల్పశ్రీనివాసరావు, ఎంపీడీవో ఎంఏ హై, ఎంపీవో శ్రీనివాస్‌, ఏపీవో మల్లయ్య, పశువైద్యాధికారులు సరిత, శాంతిరేఖ, విద్యుత్‌ శాఖ ఏఈ శిరీష, వైద్యాధికారి సునీల్‌కుమార్‌, ఏపీఎం శ్రీనివాస్‌గౌడ్‌ పాల్గొన్నారు.  

Updated Date - 2022-08-26T03:37:47+05:30 IST