అమరవీరులను స్మరించుకోవాలి

ABN , First Publish Date - 2022-08-15T06:11:14+05:30 IST

భారత స్వాతంత్య్ర సమరంలో పోరాడి అమరులైన వారి ని స్మరించుకోవాలని ఎమ్మెల్యే రాథోడ్‌ బాపురావు అన్నారు. ఆదివారం 75వ స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా భోథ్‌ మార్కెట్‌ యార్డు ప్రాంగణం లో సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ సాంస్కృతిక సారథి, కళాజాతా ప్రదర్శన నిర్వహించారు.

అమరవీరులను స్మరించుకోవాలి
సాంస్కృతిక కార్యక్రమాలను తిలకిస్తున్న ఎమ్మెల్యే బాపురావు

వజ్రోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే రాథోడ్‌ బాపురావు

బోథ్‌, ఆగస్టు 14: భారత స్వాతంత్య్ర సమరంలో పోరాడి అమరులైన వారి ని స్మరించుకోవాలని ఎమ్మెల్యే రాథోడ్‌ బాపురావు అన్నారు. ఆదివారం 75వ స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా భోథ్‌ మార్కెట్‌ యార్డు ప్రాంగణం లో సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ సాంస్కృతిక సారథి, కళాజాతా ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ దేశ స్వాతంత్య్ర పోరాటంలో ఎంతో మంది మహానుభావులు ప్రాణ త్యాగం చేశారని, జైలు జీవితాలు అనుభవించారాన్నారు. వారి పోరాట స్ఫూర్తి తో ప్రభుత్వ ఆదేశాలతో నిర్వహిస్తున్న 75వ స్వాతంత్య్ర వజ్రోత్సవాలలో ప్రజలందరూ భాగస్వాములై విజయవంతం చేయాలన్నారు. గాంధీ, అంబేద్క ర్‌ వంటి మహనీయుల ఆశయాలను నిజం చేయాలన్నారు. కుల, మతాలకు అతీతంగా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను నిరుపేదలకు అందిస్తోంద న్నారు. అనంతరం మోడల్‌ స్కూల్‌, కేజీబీవీ పాఠశాలల్లో విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా దేశభక్తి గీతాలపై నృత్యాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రాథోడ్‌ రమేష్‌, డీటీసీ సంధ్యారాణి, తహసీల్దార్‌ అతికోద్దిన్‌, సర్పంచ్‌ సురేంధర్‌ యాదవ్‌, తదితరులు పాల్గొన్నారు.

Read more