మంచిర్యాల-అంతర్గాం వంతెన నిర్మించాలి

ABN , First Publish Date - 2022-01-22T04:11:27+05:30 IST

గోదావరి నదిపై మంచిర్యాల, పెద్దపల్లి జిల్లా అంతర్గాం లను కలుపుతూ వంతెన నిర్మాణాన్ని ప్రారంభించాలని వంతెన సాధన సమితి సభ్యులు పేర్కొన్నారు. శుక్రవారం వంతెన నిర్మాణాన్ని ప్రారంభించాలని ఐబీ చౌరస్తా అంబేద్కర్‌ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు.

మంచిర్యాల-అంతర్గాం వంతెన నిర్మించాలి
అంబేద్కర్‌ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న బ్రిడ్జి సాధన సమితి సభ్యులు

ఏసీసీ, జనవరి 21: గోదావరి నదిపై మంచిర్యాల, పెద్దపల్లి జిల్లా అంతర్గాం లను కలుపుతూ వంతెన నిర్మాణాన్ని ప్రారంభించాలని వంతెన సాధన సమితి సభ్యులు పేర్కొన్నారు. శుక్రవారం   వంతెన నిర్మాణాన్ని ప్రారంభించాలని ఐబీ చౌరస్తా అంబేద్కర్‌ విగ్రహం వద్ద  నిరసన చేపట్టారు.  సభ్యులు మాట్లాడు తూ సీఎం కేసీఆర్‌ 2018 ఫిబ్రవరి 27న మంచిర్యాల-అంతర్గాం వంతెన నిర్మాణానికి అవసరమైన రూ.125 కోట్లను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారన్నారు. నాలుగు సంవత్సరాలు కావస్తున్నా సీఎం హామీ అమలుకు నోచుకోలేదని విమర్శించారు. గతంలో వంతెన సాధన సమితి ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన కార్యక్రమాల వల్ల ప్రభుత్వంలో కొంత చలనం వచ్చి సింగ రేణి డీఎంఎఫ్‌టీ ఫండ్‌ నుంచి పనులు చేపడతామని ప్రకటించారరన్నారు.  ఇప్పటికైనా  ఎంపీ, ఎమ్మెల్యేలు వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేయించి పనులను ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు.  కార్యక్రమంలో తుల మధుసూధన్‌రావు, నల్ల నాగేంద్ర ప్రసాద్‌, సూర్యనారాయణ, రాజ్‌కుమార్‌, నరేష్‌, ప్రదీప్‌, సిసోడియా, ప్రవీణ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-22T04:11:27+05:30 IST