సఖీ సేవలను సద్వినియోగం చేసుకోవాలి

ABN , First Publish Date - 2022-04-24T06:35:15+05:30 IST

సఖీ కేంద్రం అందించే సేవలను సద్వినియోగం చే సుకోవాలని సఖీ కేంద్రం లీగల్‌ కౌన్సిలర్‌ మంజులత, సంగమిత్రలు పేర్కొన్నారు. శనివారం మావల మండల కేంద్రానికి సమీపంలోని చావర అకాడమి హైస్కూల్‌లో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మేరకు మహిళలు

సఖీ సేవలను సద్వినియోగం చేసుకోవాలి
పోస్టర్లను విడుదల చేస్తున్న సఖీ నిర్వాహకులు

మావల, ఏప్రిల్‌ 23: సఖీ కేంద్రం అందించే సేవలను సద్వినియోగం చే సుకోవాలని సఖీ కేంద్రం లీగల్‌ కౌన్సిలర్‌ మంజులత, సంగమిత్రలు పేర్కొన్నారు. శనివారం మావల మండల కేంద్రానికి సమీపంలోని చావర అకాడమి హైస్కూల్‌లో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మేరకు మహిళలు  ఎదుర్కొంటున్న సమస్యలను, గృహహింస, వరకట్నం, బాల్య వివాహాలు, అక్రమ రవాణా, తదితర అంశాలపై అవగాహన కల్పించారు. అదేవిధంగా అత్యవసర సేవల కోసం 1098, 1 81, 100,14567 కు ఫోన్‌ చేసి సమాచారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సఖీ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Read more