మహనీయుల జీవిత చరిత్రను ఆదర్శంగా తీసుకోవాలి : మున్సిపల్‌ చైర్మన్‌

ABN , First Publish Date - 2022-11-21T01:06:23+05:30 IST

నిత్య జీవితంలో పుస్తక పఠనా న్ని భాగం చేసుకోవడం ద్వారా అనేక లాభాలున్నాయని, మహనీయుల జీవి త చరిత్రలను చదివి వారి అనుభవాలను స్పూర్తిగా తీసుకుంటూ ముందు కు సాగాలని మున్సిపల్‌ చైర్మన్‌ జోగు ప్రేమేందర్‌ అన్నారు.

మహనీయుల జీవిత చరిత్రను ఆదర్శంగా తీసుకోవాలి : మున్సిపల్‌ చైర్మన్‌
మాట్లాడుతున్న మున్సిపల్‌ చైర్మన్‌ జోగు ప్రేమేందర్‌

ఆదిలాబాద్‌, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): నిత్య జీవితంలో పుస్తక పఠనా న్ని భాగం చేసుకోవడం ద్వారా అనేక లాభాలున్నాయని, మహనీయుల జీవి త చరిత్రలను చదివి వారి అనుభవాలను స్పూర్తిగా తీసుకుంటూ ముందు కు సాగాలని మున్సిపల్‌ చైర్మన్‌ జోగు ప్రేమేందర్‌ అన్నారు. 55వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఈనెల 14వ తేదీ నుంచి ఘనంగా జరుపుతుండగా.. ఆదివారం వారోత్సవాల ముగింపు కార్య క్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ముందుగా గ్రంథా లయ చైర్మన్‌ రౌతు మనోహర్‌తో కలిసి సరస్వతి దేవి చిత్రపటం వద్ద ప్రత్యే క పూజలు చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గ్రంథాలయాల ఆవశ్యకతను తెలియచెప్పేలా గతవారం రోజు లుగా వివిధ కార్యక్రమాలను నిర్వహించినట్లు తెలిపారు. మహనీయుల జీవిత చరిత్రలతో కూడిన పుస్తకాలను చదవడం ద్వారా విద్యార్థులు చైతన్య వంతులుగా మారుతారని, తద్వారా మెరుగైన సమాజం నిర్మించవచ్చని ఆయన పేర్కొన్నారు. గ్రంథాలయ అభివృద్ది పనులను త్వరితగతిన పూర్తి చేసి పాఠకులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగుచర్యలు తీసు కుంటామని స్పష్టం చేశారు. అనంతరం ఆయా పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్థులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలు ఆహూతులను విశేషంగా ఆకట్టు కున్నాయి. వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన పోటీల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. ఇందులో కౌన్సిలర్‌ ప్రకాష్‌, కేవీ మునేశ్వర్‌, సతీష్‌, గ్రంథాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-21T01:06:27+05:30 IST