కేసీఆర్‌కు గుణపాఠం చెబుదాం : అద్దంకి దయాకర్‌

ABN , First Publish Date - 2022-03-05T07:15:30+05:30 IST

రాజ్యాంగాన్ని మార్చాలన్న ముఖ్యమంత్రి కేసీఅర్‌కు రానున్న ఎన్నికల్లో గుణపాఠం చెబుదామని ఏఐసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్‌ అన్నారు.

కేసీఆర్‌కు గుణపాఠం చెబుదాం : అద్దంకి దయాకర్‌
సమావేశంలో మాట్లాడుతున్న ఏఐసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్‌

భైంసా, మార్చి 4 :  రాజ్యాంగాన్ని మార్చాలన్న ముఖ్యమంత్రి కేసీఅర్‌కు రానున్న ఎన్నికల్లో గుణపాఠం  చెబుదామని ఏఐసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్‌ అన్నారు. రెవెన్యూ డివిజన్‌ కేంద్రమైన భైంసాలో ముఖ్యమంత్రి కేసీ ఆర్‌పై నిప్పులు చెలరేగారు. శుక్రవారం  స్థానికంగా జరిగిన బీఅర్‌ అంబేద్కర్‌ విగ్రహవిష్కరణ కార్యక్రమంలో, అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. 80 వేల పుస్తకాలు చదివానని ప్రగల్బాలు పలికే ముఖ్య మంత్రి కేసీఆర్‌ రాజ్యాంగాన్ని చదువక, అవగాహన కల్పించుకోక ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నాడని దుయ్యబట్టారు. రాజ్యాంగం కల్పించిన హక్కుల ద్వారా పాలనాధికారం దక్కించుకున్న ముఖ్యమంత్రి అధికార దర్పంతో విర్రవీగుతూ మాట్లాడుతున్నాడని విమర్శించారు. అన్నింటా దొర ఆహంకారం చూపాలని చూస్తే దళితులంతా ఐక్యమై బొందపెడుతామన్నారు. రాజ్యాంగాన్ని మార్చే దమ్ము, దైర్యం ఎవరికి లేదన్నారు. మరోమారు రాజ్యాంగం మార్చాలని మాట్లాడి తే బహుజనులంతా సంఘటితమై నిన్నే మార్చివేస్తారని పేర్కొన్నారు. సంక్షేమ పథకాల పేరిట వేలాది కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కాజేస్తూ రాష్ట్రాన్ని అప్పులమయం చేస్తున్నారని ఆరోపించారు. 70 సంవత్సరాల వయస్సుకు మించి బతుకలేని నేటి రోజుల్లో వందల కోట్లూ లూటి చేసి పోయేటప్పుడు తీసుకు వెలతార అన్ని ప్రశ్నించారు. రాజకీయమంటే ప్రజాసేవ చేయాలే తప్ప కోట్లకు కోట్లు సంపాదించు కోవడం కాదన్నారు. ఇందులో డీసీసీ అధ్యక్షులు పవార్‌ రాంరావ్‌ పటేల్‌, ఎస్సీ సెల్‌ ఉమ్మడి జిల్లా ప్రతినిధి భీంరావ్‌ డొంగ్రే, పార్టీ ప్రతినిధులు వి.శ్రీనివాస్‌, షేక్‌అంజాద్‌, ఫేరోజ్‌ఖాన్‌, కుంటరవి, ఎల్లప్ప, సాయి నాథ్‌తో పాటు పలువురు పాల్గొన్నారు. 

Updated Date - 2022-03-05T07:15:30+05:30 IST