పాఠాలు విద్యార్థులకుఅర్థమయ్యే రీతిలో బోధించాలి

ABN , First Publish Date - 2022-12-16T22:10:25+05:30 IST

ఆసిఫాబాద్‌, డిసెంబరు 16: విద్యార్థులకు పాఠ్యాం శాలపై పూర్తి అవగాహన కలిగే విధంగా అర్థ మయ్యే రీతిలో విద్యాబోధన చేయాలని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో అదనపుకలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయితో కలిసి ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల అధ్యాపకులు, సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

పాఠాలు విద్యార్థులకుఅర్థమయ్యే రీతిలో బోధించాలి

- కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌

ఆసిఫాబాద్‌, డిసెంబరు 16: విద్యార్థులకు పాఠ్యాం శాలపై పూర్తి అవగాహన కలిగే విధంగా అర్థ మయ్యే రీతిలో విద్యాబోధన చేయాలని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో అదనపుకలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయితో కలిసి ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల అధ్యాపకులు, సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ వార్షికపరీక్షల ఫలితాలలో వంద శాతం ఉత్తీర్ణత సాధించే విధంగా అధ్యాపకులు విద్యా ర్థులకు బోధించాలన్నారు. కళాశాలలో విద్యార్థుల హాజరుశాతం పెంచాలని తెలిపారు. కొంతమంది విద్యార్థులు తరగతులకు గైర్హాజరై వ్యవసాయ పను లకు వెళ్తున్నారని వారిని పిలిపించి విద్య ఆవశ్యకతను వివరించాలన్నారు. తరగతులకు హాజరయ్యేలా అవగా హన కల్పించి డ్రాపవుట్‌ కాకుండా చర్యలు తీసుకోవా లన్నారు. అర్హులైన విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించే విషయంలో బకాయి ఉన్న కళాశాలల వివరాలతో నివేదిక తయారు చేసి అందించాలన్నారు.

Updated Date - 2022-12-16T22:10:28+05:30 IST