ఐఆర్‌డీఏ నిర్ణయాలను ఉపసంహరించుకోవాలి

ABN , First Publish Date - 2022-11-11T22:42:04+05:30 IST

ఆసిఫాబాద్‌, నవంబరు 11: ఎల్‌ఐసీలో పని చేస్తున్న ఏజెంట్లకు నష్టం కలిగించేలా ఐఆర్‌డీఏ తీసు కున్న నిర్ణయాలను వెంటనే ఉపసంహరించుకోవాలని లియాఫీ సంఘంబ్రాంచి కార్యదర్శి సాయికృష్ణ, కోశాధి కారిరమేష్‌ అన్నారు.

ఐఆర్‌డీఏ నిర్ణయాలను ఉపసంహరించుకోవాలి

ఆసిఫాబాద్‌, నవంబరు 11: ఎల్‌ఐసీలో పని చేస్తున్న ఏజెంట్లకు నష్టం కలిగించేలా ఐఆర్‌డీఏ తీసు కున్న నిర్ణయాలను వెంటనే ఉపసంహరించుకోవాలని లియాఫీ సంఘంబ్రాంచి కార్యదర్శి సాయికృష్ణ, కోశాధి కారిరమేష్‌ అన్నారు. లియాఫీ ఆల్‌ఇండియా సంఘం పిలుపు మేరకు శుక్రవారం బెల్లంపల్లి, ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌ కార్యాలయాల పరిధిలో పనిచేస్తున్న ఏజెంట్లు కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సంద ర్భంగా మాట్లాడుతూ ఒక ఏజెంటు చేసిన పాలసీని ఇంకో ఏజెంటు తీసుకొనే విధంగా కల్పించిన వెసులు బాటును వెనక్కి తీసుకోవాలన్నారు. ఎల్‌ఐసీ ఏజెం ట్లను ఇతర ప్రైవేటు సంస్థలకు కేటాయించరాదని, పాలసీపై 18శాతం జీఎస్టీని వేయడం దారుణ మన్నారు. ఎన్నో సైబర్‌ నేరాలకు వీలయ్యే విధంగా పాలసీలను డిజిటల్‌చేస్తూ డీఎంటీఏ లింకు చేయడం సరికాదన్నారు. ఏజెంట్ల ధర్నాకు డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్‌ సంఘీభావం తెలిపారు. అనంతరం కలె క్టరేట్‌లో వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్‌రావు, పోచయ్య, సుభాష్‌, సతీష్‌, మల్లేష్‌, వసంత్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-11-11T22:42:04+05:30 IST

Read more