కేసుల దర్యాప్తులో పారదర్శకంగా వ్యవహరించాలి
ABN , First Publish Date - 2022-12-15T22:44:46+05:30 IST
ఆసిఫాబాద్, డిసెంబరు 15: కేసుల దర్యాప్తులో మరింత పారదర్శ కంగా వ్యవహరించాలని ఎస్పీ సురేష్‌కుమార్ అన్నారు. గురువారం పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లా డుతూ కేసు నమోదు నుంచి చార్జిషీట్ వరకు ప్రతి విషయాన్ని కూలం కశంగా పరిశోధన చేసి ఫైనల్ చేయాలన్నారు.
ఆసిఫాబాద్, డిసెంబరు 15: కేసుల దర్యాప్తులో మరింత పారదర్శ కంగా వ్యవహరించాలని ఎస్పీ సురేష్‌కుమార్ అన్నారు. గురువారం పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లా డుతూ కేసు నమోదు నుంచి చార్జిషీట్ వరకు ప్రతి విషయాన్ని కూలం కశంగా పరిశోధన చేసి ఫైనల్ చేయాలన్నారు. రౌడీలు, కేడీలు సస్పెక్ట్‌ల కదిలి కలపై నిరంతరం నిఘా పెట్టాలన్నారు. పెండింగ్ కేసులను పరిష్కరించాలన్నారు. ప్రతి కేసులో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ ఉండాలని, పారదర్శకంగా కేసుల విచా రణ జరపాలన్నారు. సీసీటీఎన్‌ఎస్‌లో డాటా ఎంట్రీ ప్రతిరోజు మానిటర్ చేయాలని ఎస్సైలకు సూచిం చారు. అనంతరం జిల్లా స్థాయిలో వార్షికఫైరింగ్‌లో ఉత్తమప్రతిభ కనబర్చిన టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ దామెర సుధాకర్, ఫంక్షనల్ వర్టికల్స్ విభాగంలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన పోలీసు సిబ్బందికి ఎస్పీ క్యాష్ రివార్డు అందించి అభినం దించారు. సమావేవంలో ఏఎ స్పీలు అచ్చేశ్వర్‌రావు, భీంరావు, డీఎస్పీలు శ్రీనివాస్, కరుణాకర్, సీఐలు, ఎస్సైలు, ఐటీకోర్ సిబ్బంది పాల్గొన్నారు.