స్వాతంత్య్ర వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలి
ABN , First Publish Date - 2022-08-05T04:18:49+05:30 IST
ప్రభుత్వ సూచన మేరకు ఈనెల 8 నుంచి 22వరకు స్వాతంత్య్ర వజ్రోత్సవాలను జిల్లాలో ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు.
- కలెక్టర్ రాహుల్‌రాజ్
ఆసిఫాబాద్, ఆగస్టు 4: ప్రభుత్వ సూచన మేరకు ఈనెల 8 నుంచి 22వరకు స్వాతంత్య్ర వజ్రోత్సవాలను జిల్లాలో ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. కలెక్టరేట్‌లో జడ్పీ చైర్‌పర్సన్ కోవ లక్ష్మి, అదనపుకలెక్టర్‌లు రాజేశం, చాహత్‌బాజ్‌పాయ్‌తో కలిసి వేడుకలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ప్రభు త్వం నిర్ణయించిన మేరకు 8న రాష్ట్రరాజధానిలో ప్రారంభ కార్యక్రమం ఉంటుందని, 9న ప్రతీ ఇంటికి జాతీయజెండాల పంపిణీ కార్యక్రమం, 10న మొక్కలు నాటే కార్యక్రమం, 11న పోలీస్‌విభాగంతో కలిసి ఫ్రీడం రన్, 12న జాతీయ సమైక్యత రక్షాబంధన్, 13న జాన పద కళాకారులతో జిల్లాకేంద్రాల్లో, నియోజకవర్గ కేంద్రాల్లో ప్రదర్శనలు, 15న స్వాతంత్య్ర దినోత్సవం, 16న జిల్లాకేంద్రంలో కవి సమ్మేళనం కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలి పారు. దీనికోసం ఆసక్తి గలవారు ఈనెల 10లోపు దరఖాస్తు చేసుకోవాల న్నారు. అన్ని గ్రామపంచాయతీలు, మున్సిపాటీ లలో తెలంగాణ రాష్ట్రగీతాలపన చేయా లని నిర్ణయించినట్లు తెలిపారు. 17న జిల్లా కేంద్రాల్లో రక్తదాన శిబిరాలు, 18న క్రీడాకారులకు, అధికారులకు ఫ్రీడం కప్పు పేరుతో పోటీలు నిర్వహించాలని తెలి పారు. 19నఆస్పత్రుల్లో, వృద్ధాశ్రమాల్లో, అనాథాశ్ర మాల్లో పండ్ల పంపిణీ, 20న రంగోళి పోటీలు, 21న ప్రత్యక గ్రామపంచాయతీ, మండల, జిల్లా పరిషత్ మీటింగ్‌లు నిర్వహించాలన్నారు. 22నరాష్ట్ర రాజధా నిలో నిర్వహించే కార్యక్రమంతో వజ్రోత్స వాలు పూర్త వుతాయన్నారు. నిర్ణయించిన తేదీల ప్రకారం అధికా రులు హాజరు కావాలని తెలిపారు. వేడుకల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు.