ఆకట్టుకొన్న జిల్లా స్థాయి జానపద నృత్య పోటీలు
ABN , First Publish Date - 2022-10-18T03:24:01+05:30 IST
పట్టణంలోని సైన్స్ కేం ద్రంలో జిల్లా సైన్స్ అధికారి మధుబాబు అధ్యక్షతన జానపద నృత్య పోటీలు సోమవారం నిర్వహిం చారు. ముఖ్య అతిథిగా డీఈవో వెంకటేశ్వర్లు పా ల్గొని రాష్ట్ర స్థాయికి ఎంపికైన విజేతలకు బహు మతులు అందజేశారు. డీఈవో మాట్లాడుతూ మానవాళి ప్రయోజనం కోసం సైన్స్ అండ్ టెక్నా లజీ ఆవశ్యకతను పాటలు, నాటికల రూపంలో విద్యార్థుల ప్రదర్శన ఆకట్టుకుందన్నారు.
ఏసీసీ, అక్టోబరు 17: పట్టణంలోని సైన్స్ కేం ద్రంలో జిల్లా సైన్స్ అధికారి మధుబాబు అధ్యక్షతన జానపద నృత్య పోటీలు సోమవారం నిర్వహిం చారు. ముఖ్య అతిథిగా డీఈవో వెంకటేశ్వర్లు పా ల్గొని రాష్ట్ర స్థాయికి ఎంపికైన విజేతలకు బహు మతులు అందజేశారు. డీఈవో మాట్లాడుతూ మానవాళి ప్రయోజనం కోసం సైన్స్ అండ్ టెక్నా లజీ ఆవశ్యకతను పాటలు, నాటికల రూపంలో విద్యార్థుల ప్రదర్శన ఆకట్టుకుందన్నారు. జానపద నృత్యరూపకంలో సుద్దాల జడ్పీహెఎస్‌ఎస్ పాఠ శాల ప్రథమ, ముత్యంపల్లి జడ్పీఎస్‌ఎస్ ద్వితీయ, మంచిర్యాల కేజీబీవీ పాఠశాల తృతీయ స్థానంలో నిలిచాయన్నారు. సైన్స్ డ్రామా విభాగంలో ము త్యంపల్లి జడ్పీఎస్‌ఎస్ పాఠశాల ప్రథమ, గుండ్లసో మారం జడ్పీఎస్‌ఎస్ పాఠశాల ద్వితీయ, మంచిర్యాల సీహెచ్‌ఎస్ గర్మిళ్ల పాఠశాల తృతీ య స్థానంలో నిలిచాయన్నారు. దృశ్యరూపంలో సందేశాత్మకంగా ప్రదర్శించిన విద్యార్థుల ప్రతిభను అభినందించారు. న్యాయనిర్ణేతలుగా యోగేశ్వర్, నారాయణరావు, సాగర్, శ్రీనివాస్, గేయ రచయిత చంద్రమౌళిలు వ్యవహరించారు. సెక్టోరల్ అధికారి సఫ్దర్ ఆలీఖాన్, చౌదరి, పద్మజ పాల్గొన్నారు.