ఉపాధ్యాయుల అక్రమ బదిలీలను రద్దు చేయాలి
ABN , First Publish Date - 2022-06-27T04:03:14+05:30 IST
ఉపాధ్యాయుల అక్రమ బదిలీలను రద్దు చేయాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శాంతికుమారి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని టీఎస్‌యూటీఎఫ్ భవన్‌లో నిర్వహించిన సమావేశంలో జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గొల్ల రామన్న, గుర్రాల రాజవేణులతో కలిసి ఆమె మాట్లాడారు. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్‌ను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఏసీసీ, జూన్ 26: ఉపాధ్యాయుల అక్రమ బదిలీలను రద్దు చేయాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శాంతికుమారి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని టీఎస్‌యూటీఎఫ్ భవన్‌లో నిర్వహించిన సమావేశంలో జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గొల్ల రామన్న, గుర్రాల రాజవేణులతో కలిసి ఆమె మాట్లాడారు. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్‌ను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన మన ఊరు మన బడి, ఇంగ్లీషు మీడియం పథకాలు అమలు జరగాలంటే ఉపాధ్యాయులు, ఎంఈవోల నియామకాలు చేపట్టాలన్నారు. పాఠశాలల్లో పారిశుధ్య నిర్వహణకు సిబ్బందిని నియమించాలని, యూనిఫాంలను పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు నాయకులు నర్సయ్య, చంద్రమౌళి, జైపాల్, కిరణ్ పాల్గొన్నారు.