ఘనంగా వేంకటేశ్వరస్వామి పల్లకీ సేవ

ABN , First Publish Date - 2022-11-15T21:55:17+05:30 IST

పట్టణంలోని వేంక టేశ్వర ఆలయ స్వర్ణోత్సవాలు మంగళవారం సాయం త్రం ముగిశాయి. ఉదయం మహా పూర్ణాహుతి, కుంఽభ ప్రోక్షణ పూజలు నిర్వహించారు. యాగశాలలో ముగిం పు యజ్ఞ పూజలను నిర్వహించారు.

ఘనంగా వేంకటేశ్వరస్వామి పల్లకీ సేవ

మందమర్రిటౌన్‌, నవంబరు 15: పట్టణంలోని వేంక టేశ్వర ఆలయ స్వర్ణోత్సవాలు మంగళవారం సాయం త్రం ముగిశాయి. ఉదయం మహా పూర్ణాహుతి, కుంఽభ ప్రోక్షణ పూజలు నిర్వహించారు. యాగశాలలో ముగిం పు యజ్ఞ పూజలను నిర్వహించారు. దేవనాధ రామా నుజ జీయర్‌ స్వామి, పండితుల వేద మంత్రోచ్ఛా రణల మధ్య ఘనంగా జరిగాయి. వేంకటేశ్వర స్వామి, అలివేలు మంగ విగ్రహాలతో పల్లకి సేవ నిర్వహిం చారు. భక్తులనుద్దేశించి దేవనాధ రామానుజ జీయర్‌ స్వామి మాట్లాడుతూ ఐదు రోజుల స్వర్ణోత్సవ వేడుక లకు వేల సంఖ్యలో భక్తులు తరలి రావడం స్వామి వారి అనుగ్రహమేనని తెలిపారు. వేడుకలకు త్రిదండి చిన జీయర్‌ స్వామి రావడం ఈ ప్రాంత ప్రజలు చేసుకున్న పుణ్యమని తెలిపారు. హిందూ సంప్రదా యాలను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉంద న్నారు. దైవానుగ్రహంతోనే ప్రగతిలో ముందుంటారని తెలిపారు. ఈ మాసమంతా కార్తీక మాసమైనందున దీపాలను వెలగించాలన్నారు. భక్తులకు సేవ చేసిన 350 మంది సేవలకు దక్షిణ అందజేశారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన పండితులకు దక్షిణ అందజేశా రు. చివరి రోజు దాదాపు 20 వేల మంది భక్తులు హాజరు కావడంతో అంజని పుత్ర ఎస్టేట్స్‌ప్రైవేటు లిమిటెడ్‌ కంపెనీ వారు అన్నదానం, ప్రసాదాలను అందజేశారు. జీఎం చింతల శ్రీనివాస్‌, మేడిపల్లి సంపత్‌, పంజాల ఈశ్వర్‌ దంపతులు హాజర య్యారు. స్వర్ణోత్సవాలకు సహకరిం చిన ఏరియా జీఎం చింతల శ్రీని వాస్‌ను అభినందించి కంకరణధా రణ చేశారు.అర్చకులు అజయ్‌చారి, గోవర్ధనగిరి నర్సింహాచారి, మధుసూదన్‌చారి, అనంతచార్యులు పాల్గొన్నారు. భక్తులకు అంజని పుత్ర ఎస్టేట్స్‌ సభ్యులు అన్నదానం చేయడం ఆనందం గా ఉందని దేవనాధ రామానుజ జీయర్‌ స్వామి పేర్కొన్నారు. వారిని అభినందించి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో చైర్మన్‌ గుర్రాల శ్రీధర్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ పిల్లి రవి, సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-15T21:55:17+05:30 IST

Read more