జిల్లాలో పలుచోట్ల భారీ వర్షం
ABN , First Publish Date - 2022-10-07T06:15:40+05:30 IST
జిల్లాలో బుధవారం పలుచోట్ల భారీ వర్షం కురిసింది. జిల్లావ్యాప్తంగా 29.6 మిల్లీమీటర్ల వర్షపాతం న మోదు కాగా, లక్ష్మణచాంద మండలంలో 92.6 మిల్లీమీటర్ల వర్షపాతం న మోదైంది. భారీ వర్షాలకు స్వర్ణ వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. నిర్మల్ మండలం చిట్యాల గ్రామంలో రోడ్లపై వర్షపు నీరు ప్రవహించడంతో ప్ర జలు ఇబ్బందులు పడ్డారు.
నిర్మల్, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో బుధవారం పలుచోట్ల భారీ వర్షం కురిసింది. జిల్లావ్యాప్తంగా 29.6 మిల్లీమీటర్ల వర్షపాతం న మోదు కాగా, లక్ష్మణచాంద మండలంలో 92.6 మిల్లీమీటర్ల వర్షపాతం న మోదైంది. భారీ వర్షాలకు స్వర్ణ వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. నిర్మల్ మండలం చిట్యాల గ్రామంలో రోడ్లపై వర్షపు నీరు ప్రవహించడంతో ప్ర జలు ఇబ్బందులు పడ్డారు. ఇళ్ల మధ్యలోకి భారీ వర్షం నీరు వచ్చి చేరిం ది. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు జిల్లాలోని సాగునీటి ప్రా జెక్టులకు వరద కొనసాగుతోంది. గడ్డెన్న వాగు ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 358.70 మీటర్లు కాగా ప్రస్తుతం 358.70 మీటర్లకు చేరింది. ప్రాజెక్టు నీటిలో సామర్థ్యం 1.852 టీఎంసీలు కాగా ప్రస్తుతం 1.852 టీఎంసీలకు చేరింది. ఎగువన కురుస్తున్న వర్షాలకు 400ల క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టులోకి చేరుతుండడంతో ప్రాజెక్టు ఒక గేటును ఎత్తి 2250 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. కడెం ప్రాజెక్టు పూ ర్తిస్థాయి నీటి మట్టం 700ల అడుగులు కాగా ప్రస్తుతం 689.77 అడుగు లుగా ఉంది. ప్రాజెక్టు ఎగువ ప్రాంతం నుంచి 2324 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా ఒక వరద గేటు ఎత్తి దిగువన 4605 క్యూ సెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు.
గడ్డెన్నవాగు ప్రాజెక్టు నుంచి నీటి విడుదల
భైంసా: ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాల మూలంగా గడ్డెన్నవాగు ప్రాజెక్టులోకి గురువారం వరద నీరు వచ్చి చేరింది. ప్రాజెక్టు నిర్వాహణా ధికారులు ప్రాజెక్టుకు సంబంధించి ఒక వరద గేట్‌ను రెండు మీటర్ల మేర ఎత్తి సుద్దవాగులోకి 2250 క్యూసెక్కుల నీటిని వదిలిపెట్టారు. పూర్తి స్థాయికి చేరుకుంటుండంతో నీటి విడుదలకు చర్యలు చేపట్టారు.