ఘనంగా ఎన్‌ఎస్‌ఎస్‌ డే

ABN , First Publish Date - 2022-09-25T04:25:27+05:30 IST

మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో శనివారం జాతీయ సేవా పథకం దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం అధికారి తపన్‌ కుమార్‌ మండల్‌ ఆధ్వర్యంలో విద్యార్థులు కళాశాల ఆవరణలో శ్రమదానం నిర్వహించారు.

ఘనంగా ఎన్‌ఎస్‌ఎస్‌ డే
కార్యక్రమంలో మాట్లాడుతున్న ప్రోగ్రాం అధికారి తపన్‌కుమార్‌ మండల్‌

బెజ్జూరు, సెప్టెంబరు 24: మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో శనివారం జాతీయ సేవా పథకం దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం అధికారి తపన్‌ కుమార్‌ మండల్‌ ఆధ్వర్యంలో విద్యార్థులు కళాశాల ఆవరణలో శ్రమదానం నిర్వహించారు. విద్యార్థులు సమాజంలో సేవచేస్తూ పలువురికి ఆదర్శంగా నిలువా లన్నారు. అధ్యాపకులు ప్రశాంత్‌, సునీత, ప్రవీణ్‌, జ్ఞానేశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు.

కౌటాల: మండలకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో శనివారం జాతీయసేవాపథకం దినోత్సవా న్ని ఘనంగా జరుపుకున్నారు. యూనిట్‌ ఇన్‌చార్జి రాము, రాజాం, ప్రిన్సిపాల్‌ స్వరూప, బాలకిషన్‌రావు, అశోక్‌, రామారావు, రంజిత్‌పాల్గొన్నారు.

కాగజ్‌నగర్‌ టౌన్‌: స్థానిక జూనియర్‌ కళాశాలలో నిర్వహించిన సమావేశంలో ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ తిరుపతి, కళాశాల ఇన్‌చార్జి ఆసిఫ్‌, ఎన్‌ఎస్‌ఎస్‌ పీవో రవి, లెక్చరర్లు పాల్గొన్నారు.

వాంకిడి: మండలంలోని ప్రభుత్వ జూనియర్‌ కళా శాలలో విద్యార్థులకు ఎన్‌ఎస్‌ఎస్‌ దినోత్సవంపై క్విజ్‌ పోటీలు నిర్వహించి గెలుపొందిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ప్రోగ్రామ్‌ అధికారి చంద్రయ్య, అధ్యాపకులు పాల్గొన్నారు.

Updated Date - 2022-09-25T04:25:27+05:30 IST