ఘనంగా కోట్నాక భీంరావు వర్ధంతి

ABN , First Publish Date - 2022-08-30T04:33:39+05:30 IST

మాజీ గిరిజన సంక్షేమశాఖ మంత్రి కోట్నాక భీంరావు 22వ వర్ధంతిని జిల్లా కేంద్రంలోని చిల్డ్రన్స్‌పార్కులో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఆదివాసీ సంస్కృతి సంప్రదా యాల మధ్య డప్పువాయిద్యాలతో వర్ధంతి వేడుకలు నిర్వహించారు.

ఘనంగా కోట్నాక భీంరావు వర్ధంతి
కోట్నాక భీం రావు చిత్రపటం వద్ద నివాళులు అర్పిస్తున్న కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌, ఐటీడీఏ పీవో, జడ్పీ చైర్‌పర్సన్‌

ఆసిఫాబాద్‌ రూరల్‌, ఆగస్టు 29: మాజీ గిరిజన సంక్షేమశాఖ మంత్రి కోట్నాక భీంరావు 22వ వర్ధంతిని జిల్లా కేంద్రంలోని చిల్డ్రన్స్‌పార్కులో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఆదివాసీ సంస్కృతి సంప్రదా యాల మధ్య డప్పువాయిద్యాలతో వర్ధంతి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌, ఐటీడీఏ పీవో వరుణ్‌రెడ్డి, అదనపుకలెక్టర్‌లు పాల్గొని పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్ర మంలో భీంరావు కూతుర్లు జడ్పీ చైర్‌పర్సన్‌ కోవ లక్ష్మి, మర్సుకోల సరస్వతి, జడ్పీటీసీ, ఎంపీపీలు, అధికారులు నాయకులు పాల్గొన్నారు.

సిర్పూర్‌(యూ): ఆదివాసీల ఆత్మబంధు వు మాజీమంత్రి కోట్నాక భీంరావు అని జైనూర్‌ మార్కెట్‌కమిటీచైర్మన్‌ ఆత్రం భగవం త్‌రావు అన్నారు. సోమవారం మండల కేం ద్రంలో కోట్నాక భీంరావు వర్ధంతిని ఆదివా సీలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భం గా ఆయన గిరిజనుల అభివృద్ధితోపాటు ఉమ్మడి ఆదిలాబాద్‌జిల్లా అభివృద్ధికి విశే షంగా కృషిచేశారని కొనియాడారు.

Updated Date - 2022-08-30T04:33:39+05:30 IST