ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది చేతివాటం

ABN , First Publish Date - 2022-09-23T04:01:05+05:30 IST

మంచిర్యాల జిల్లా కేంద్రం లోని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో సబ్బంది అడ్డగోలుగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతీ పనికి ఇంత అని రేటు ఫిక్స్‌ చేస్తూ కింది స్థాయి సిబ్బంది రోగులను ఇబ్బందులపాలు చేస్తున్నారు. గతంలో సైతం ఆసుపత్రి సిబ్బందిపై ఆరోపణలు వచ్చాయి. చిన్న గాయాలతో పాటు ప్రసవాల కోసం వచ్చే రోగుల నుంచి అంది నకాడికి దండుకుంటున్నారు. ఇన్‌ పేషంట్‌గా అడ్మిట్‌ అయ్యే ప్రతీ ఒక్కరి నుంచి ఎంతో కొంత ముక్కు పిండి వసూలు చేస్తున్నట్లు సమాచారం.

ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది చేతివాటం
మంచిర్యాల ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి

కుక్క కాటు ఇంజక్షన్‌కు రూ. 3 వేలు  డిమాండ్‌  

ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో సిబ్బంది నిర్వాకం 

చేతులు తడిపితేనే రోగులకు సౌకర్యాలు  

మంచిర్యాల, సెప్టెంబరు  22(ఆంధ్రజ్యోతి):  మంచిర్యాల జిల్లా కేంద్రం లోని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో సబ్బంది అడ్డగోలుగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతీ పనికి ఇంత అని రేటు ఫిక్స్‌ చేస్తూ కింది స్థాయి సిబ్బంది రోగులను ఇబ్బందులపాలు చేస్తున్నారు. గతంలో సైతం ఆసుపత్రి సిబ్బందిపై ఆరోపణలు వచ్చాయి. చిన్న గాయాలతో పాటు ప్రసవాల కోసం వచ్చే రోగుల నుంచి అంది నకాడికి దండుకుంటున్నారు. ఇన్‌ పేషంట్‌గా అడ్మిట్‌ అయ్యే ప్రతీ ఒక్కరి నుంచి ఎంతో కొంత ముక్కు పిండి వసూలు చేస్తున్నట్లు సమాచారం. బెడ్‌ మీద చెద్దర్లు మార్చేందుకు సైతం డబ్బులు తీసుకుంటున్నట్లు రోగులు ఆరోపిస్తున్నారు. సెలైన్‌ బాటిల్‌ మార్చాలన్నా, డ్రెస్సింగ్‌ చేయాలన్నా తప్పనిసరిగా డబ్బులు ముట్టజెప్పాల్సిందే. కనీసం  200 రూపాయల నుంచి  వెయ్యి వరకు సిబ్బంది డిమాండ్‌ చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. డబ్బులు ఇవ్వనిదే రోగులను చూసేందుకు సైతం ముందుకు రావడం లేదని ప్రచారం జరుగుతోంది. డబ్బులు ఇచ్చే వారి పట్ల అత్యధిక శ్రద్ద చూపుతూ ఇవ్వని వారిని తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నట్లు కొందరు బాధితులు వాపోయారు. 

కుక్క కాటు ఇంజక్షన్‌కు..

కుక్క కాటుతో ఆసుపత్రికి వచ్చిన బాధితుల నుంచి సిబ్బంది కొందరు 3 వేల రూపాయలు డిమాండ్‌ చేయడం సంచలనం సృష్టించింది.    పాత మంచిర్యాలలోని సబ్‌ స్టేషన్‌ రోడ్డుకు చెందిన శ్రేయాన్స్‌ అనే బాలున్ని రెండు రోజుల క్రితం కుక్క కరిచింది. కను బొమ్మపై తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు హుటాహుటిన ప్రభుత్వ జనరల్‌ ఆసు పత్రికి తరలించారు. అక్కడ చికిత్స  చేసిన సిబ్బంది కొందరు రేబీస్‌ హిమోగ్లోబిన్‌ ఇంజక్షన్‌ వేయాల్సి ఉంటుందని, దానిని కరీంనగర్‌ నుంచి తెప్పించాలని సూచించారు.  కరీంనగర్‌ నుంచి తెప్పించడానికి 24 గంట లు పడుతుందని, ఆ లోపు బాలునికి ప్రమాదం జరిగే అవకాశాలు ఉ న్నాయని చెప్పారు. 3 వేల రూపాయలు చెల్లిస్తే స్థానికంగానే కొనుక్కొని వచ్చి ఇంజక్షన్‌ ఇస్తామని చెప్పడంతో బాధితులు ఆందోళనకు గురయ్యా రు. తమ వద్ద అంత డబ్బు లేదని, ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా చికిత్స అందిస్తారంటే ఇక్కడికి వచ్చామని వాపోయారు. దీంతో సెకండ్‌ డోస్‌కైనా డబ్బులు తీసుకువస్తే ఇంజక్షన్‌ ఇస్తామని చెప్పి పంపించారు. ఇంటికి వచ్చిన బాధితులు జరిగిన సంభాషణను ఇరుగుపొరుగు వారితో చర్చించారు. దీంతో స్థానికులు కొందరు ఆసుపత్రికి ఫోన్‌ చేసి వివరాలు అడగగా సంబంధిత డ్యూటీ నర్సు డబ్బులు అడిగిన సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇలా ప్రభుత్వ ఆసుపత్రిలో  అందుబాటులో ఉండి, ఉచితంగా వేయాల్సిన ఇంజక్షన్‌కు కూడా సిబ్బంది డబ్బులు డిమాండ్‌ చేయడం పట్ల తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. 

కేసీఆర్‌ కిట్‌తో..

రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రుల్లో పురుడుపోసుకునే మహిళలకు కేసీఆర్‌ కిట్‌ పథకం ప్రవేశపెట్టడంతో ప్రజల తాకిడి అధికమైంది. . నార్మల్‌ డెలివరీలతో పాటు సీజేరియన్‌లు కూడా చేస్తూ వైద్య సిబ్బంది మహిళలకు పురుడుపోస్తున్నారు. ఈ క్రమంలో సిజేరి యన్‌లు అయ్యే  పేషంట్‌ల నుంచి సిబ్బంది 2 వేల రూపాయల వ రకు అక్రమంగా వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. గతంలో చెన్నూర్‌ మండలా నికి చెందిన ఓ మహిళ ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో డెలివరీ కాగా వైద్యులు సిజే రియన్‌ చేసి డెలివరీ చేశారు. వారం రోజుల తర్వాత కుట్లు విప్పాల్సి ఉండగా డబ్బులు ఇస్తేనే కుట్లు  విప్పుతామని సిబ్బంది పేర్కొనడంతో సదరు మహిళ కుటుం బీకులు ఆందోళనకు దిగారు. దీంతో వైద్యులు జోక్యం చేసుకొని బాలింతకు కుట్లు విప్పడంతో వివాదం సద్దు మణిగింది. ఆర్ధికంగా పరిస్ధితులు మెరుగ్గా ఉన్న వారు సిబ్బంది అడిగినప్పుడు డబ్బులు ఇచ్చి వెళ్తుండడంతో సమస్యలు ఎదురుకావడం లేదు. బలహీన వర్గాలకు చెందిన ప్రజలు వచ్చినప్పుడు డబ్బులు చెల్లించుకోలేని  పరిస్ధితుల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

సిబ్బందికి డబ్బులు ఇవ్వొద్దు

- డాక్టర్‌ హరిచందర్‌రెడ్డి, ఆసుపత్రి సూపరింటెండెంట్‌ 

ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందే వారు సిబ్బందికి ఎలాంటి డబ్బు లు ఇవ్వొద్దు. సిబ్బంది డబ్బులు డిమాండ్‌ చేస్తే నేరుగా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. కుక్కు కాటుకు ఇచ్చే రేబీస్‌ హిమోగ్లోబిన్‌ ఇంజక్షన్‌  కూడా జిల్లా ఆసుపత్రిలో ఎల్లప్పుడు అందుబాటులో ఉంటుంది. అది కూ డా పూర్తి ఉచితంగానే బాధితులకు ఇస్తున్నాం. రేబీస్‌ హిమోగ్లోబిన్‌ ఇం జక్షన్‌ను అవసరాన్ని బట్టి మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. 

Updated Date - 2022-09-23T04:01:05+05:30 IST