మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలి
ABN , First Publish Date - 2022-12-15T22:47:09+05:30 IST
అటవీ పరిరక్షణ నియ మాల్లో మార్పులు చేశారని, ప్రతిపాదనలు సమర్పించే ముందు నూతన మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని రాష్ట్ర అటవీ ప్రధాన సంరక్షణాధికారి మోహన్‌చంద్ర పర్గెయన్ అన్నారు.
నస్పూర్, డిసెంబరు 15: అటవీ పరిరక్షణ నియ మాల్లో మార్పులు చేశారని, ప్రతిపాదనలు సమర్పించే ముందు నూతన మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని రాష్ట్ర అటవీ ప్రధాన సంరక్షణాధికారి మోహన్‌చంద్ర పర్గెయన్ అన్నారు. సీసీసీ సింగరేణి అతిథి గృహంలో గురువారం మంచిర్యాల, కుమరంభీం ఆసిఫాబాద్, పెద్దపల్లి, ములుగు, భూపాలపల్లి డీఎఫ్‌వోలతో కలిసి చట్టం ప్రకారం అటవీ భూముల్లో రోడ్ల విస్తరణ, సింగరేణికి భూముల కేటాయింపు తదితర అభివృద్ధి పనులపై సమీక్షించారు. ఆర్‌అండ్‌బీ, జాతీయ రహదారులు, పంచాయతీ రాజ్, ఎస్‌సీసీఎల్, మిషన్ భగీరథ తదితర 12 కేసులతో పాటు ఆప్టీకల్ పైబర్ కేసులకు సంబంధించిన 180 ప్రతిపాదనలపై రాష్ట్ర అటవీ ప్రధాన సంరక్షణాధికారి మోహన్ చంద్ర పర్గెయన్ సమీక్ష జరిపారు. ఆయన మాట్లాడుతూ అటవీ పరిరక్షణ నియమాల్లో కొన్ని మార్పులు వచ్చా యని, ప్రత్యేకించి దశ-1 క్లియరెన్స్, వినియోగదారు ఏజెన్సీల ద్వారా ఉల్లంఘనలను కలిగి ఉన్న ప్రతిపాదనల ప్రాసెసింగ్‌కు సంబంధించినవి ఉన్నా యన్నారు. వివిధ శాఖలు, ఫారెస్టు మధ్య సమన్వ యం, ప్రతిపాదనలు ప్రాసెస్ చేయడం ముఖ్యమైం దన్నారు. కాళేశ్వరం సీసీఎఫ్ వినోద్‌కుమార్, డీఎఫ్‌వో లు వినయ్‌కుమార్ సాహు, రమేష్, లావణ్య కిష్టగౌడ్, శివయ్య, ట్రాన్స్‌కో ఎస్‌ఈ మల్లేశం, ఈఈ రఘునం దన్, పూర్ణచందర్. శేషారావు, జ్ఞానకుమార్, అధికారులు పాల్గొన్నారు.
రహదారి విస్తరణకు అనుమతి ఇవ్వాలి
నస్పూర్‌లో నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారి విస్తరణ పనులకు త్వరగా అనుమతులు ఇవ్వాలని రాష్ట్ర అటవీ సంరక్షణ ప్రధాన అధికారి మోహన్ చంద్రవర్గేయస్‌కు మున్సిపల్ చైర్మన్ ప్రభాకర్ వినతిపత్రాన్ని అందించారు. మున్సిపాలిటీ పరిధిలో జాతీయ రహదారి విస్తరణ పనులు కొనసాగుతున్నా యని, అటవీ ప్రాంతంలో పనులు నిలిచిపోవడం వల్ల రాకపోకల్లో ఇబ్బందులు కలుగుతున్నాయని చైర్మన్ పీసీసీఎఫ్ దృష్టికి తీసుకెళ్లారు. చైర్మన్‌తో పాటు కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.