ఘనంగా ధనుర్మాసోత్సవాలు
ABN , First Publish Date - 2022-12-30T00:27:34+05:30 IST
పట్టణంలోని పద్మావతీ కాలనీ పరిధిలో గల శ్రీలక్ష్మీవెంకటేశ్వరస్వామి ఆలయంలో ధనుర్మాసోత్సవాలు భక్తుల కోలా హలం మద్య ఘనంగా కొనసాగుతున్నాయి.

భైంసా, డిసెంబర్ 29 : పట్టణంలోని పద్మావతీ కాలనీ పరిధిలో గల శ్రీలక్ష్మీవెంకటేశ్వరస్వామి ఆలయంలో ధనుర్మాసోత్సవాలు భక్తుల కోలా హలం మద్య ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో బాగంగా గురువారం ఆలయంలోని విగ్రహాలకు పూలమాలలతో శోభాయమానం గా అలంకరించి తీర్చిదిద్దారు. పట్టణంలోని వివిధ కాలనీలకు చెందిన భక్తులు అధికసంఖ్యలో ఉత్సవాలకు హాజరవుతూ భక్తి శ్రద్ధలతో పూజ లు నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో బాగంగా ప్రతీ రోజు ఉదయం వేళలో వేద పండితులు ఇందూర్తి అచార్య కళ్యాణ్ చెప్పిన తిరుప్పావై ప్రవచ నాలు భక్తుల ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచుతున్నాయి. ఆపద సమయం లో కాకుండా అన్ని వేళల ఆలయాల సందర్శన చేపడుతూ ఆధ్యాత్మిక భావాలను పెంపొందించుకోవాలని సూచించారు
Read more