ప్రజలను దగా చేస్తున్న ప్రభుత్వాలు

ABN , First Publish Date - 2022-08-18T04:14:09+05:30 IST

కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్‌ ప్రభుత్వాలు మోసపూరిత మాట లతో ప్రజలను దగా చేస్తున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కళవేణి శంకర్‌ ఆరోపిం చారు.

ప్రజలను దగా చేస్తున్న ప్రభుత్వాలు
సమావేశంలో మాట్లాడుతున్న కళవేణి శంకర్‌

ఆసిఫాబాద్‌ రూరల్‌, ఆగస్టు 17: కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్‌ ప్రభుత్వాలు మోసపూరిత మాట లతో ప్రజలను దగా చేస్తున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కళవేణి శంకర్‌ ఆరోపిం చారు. బుధవారం ఆసిఫాబాద్‌ పట్టణంలో సీపీఐ జిల్లా తృతీయ మహాసభలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జెండాను ఎగురవేసి అనంతరం మాట్లాడారు. కేంద్రం, రాష్ట్రంలో ఆర్టీసీ, కరెంటు, రైలుచార్జీలతో పాటు నిత్యావసర వస్తువులైన గ్యాస్‌, నూనె, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచి సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్నాయని ఆరోపిం చారు. నాయకులు సత్యనారాయణ, తిరుపతి, గోపి నాథ్‌, గణేష్‌, ఉపేందర్‌ పాల్గొన్నారు.

Read more