శిశుమందిర్‌లో జ్ఞాన విజ్ఞాన మేళా

ABN , First Publish Date - 2022-09-18T04:51:01+05:30 IST

జిల్లా కేంద్రంలోని శ్రీ సరస్వతీ శిశు మందిర్‌ ఉన్నత పాఠశాలలో మంచిర్యాల విభాగ్‌ జ్ఞాన విజ్ఞాన మేళాను నిర్వహించారు.

శిశుమందిర్‌లో జ్ఞాన విజ్ఞాన మేళా
కార్యక్రమంలో మాట్లాడుతున్న డీఈవో అశోక్‌కుమార్‌

ఆసిఫాబాద్‌ రూరల్‌, సెప్టెబరు 17: జిల్లా కేంద్రంలోని శ్రీ సరస్వతీ శిశు మందిర్‌ ఉన్నత పాఠశాలలో మంచిర్యాల విభాగ్‌ జ్ఞాన విజ్ఞాన మేళాను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీఈవో అశోక్‌ పాల్గొని జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు గొప్ప శాస్త్రవేతలుగా ఎదగాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన వివిధ రకా ల ప్రయోగాలను తిలకించారు.  కార్యక్రమంలో డాక్టర్‌ అనిత, డాక్టర్‌ విష్ణువర్ధన్‌, సత్యనారాయణ, వెంకన్న, రమణారెడ్డి, వేణుగోపాల్‌, శంకర్‌, ఎస్సైలు రమేష్‌, గంగాన్న, ఉపాధ్యాయులు శ్రీనివాస్‌, విజయ్‌, ప్రబోద్‌కుమార్‌, జి.శ్రీనివాస్‌, రామకృష్ణ, మహేష్‌కుమార్‌, లక్ష్మణ్‌, సదాశివ్‌, సురేష్‌ తదితరులు పాల్గొన్నారు. 

Read more