ఘనంగా కాల్వ లక్ష్మినరసింహస్వామి నాగవెల్లి
ABN , First Publish Date - 2022-05-22T06:52:59+05:30 IST
భక్తుల కొంగు బంగారమై అడిగిన వారికి వరాల నొసగే కాల్వలక్ష్మి నరసింహస్వామి నాగవెల్లిని శనివారం తెల్లవారు జామున ఘనంగా నిర్వహించారు.

దిలావర్పూర్, మే 21 : భక్తుల కొంగు బంగారమై అడిగిన వారికి వరాల నొసగే కాల్వలక్ష్మి నరసింహస్వామి నాగవెల్లిని శనివారం తెల్లవారు జామున ఘనంగా నిర్వహించారు. స్వామివారి నాగవెల్లిని కనులారా తిలకించేందుకు జిల్లా నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామివారిని దర్శిం చుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అనువంశిక యజ్ఞచార్యులు శ్రీ మాన్ చక్రపాణి నరసింహమూర్తి చేతుల మీదుగా లక్ష్మీనరసింహస్వామికి నాగవెల్లి నిర్వహించారు. అనంతరం భూతబలి, ఉద్వాసనబలి పూజలు చేశారు. సాయంత్రం స్వామివారికి ఏకాంతోత్సవం నిర్వహించారు. ఈ పూజా కార్య క్రమంలో దేవస్థానం చైర్మన్ చిన్నయ్య, ధర్మకర్తలు, భక్తులు పెద్ద ఎత్తున్న పా ల్గొన్నారు.