గౌతమబుద్ధుడి మాటలు స్ఫూర్తిదాయకం

ABN , First Publish Date - 2022-05-17T06:22:40+05:30 IST

బుద్దభగవాన్‌ అడుగు జాడలు శాంతి స్థాపనకు బాటలు వేశాయని, గౌతమబుద్ద మాటలు నేటి సమాజానికి స్ఫూర్తిదాయకం అని మున్సిపల్‌ చైర్మన్‌ జోగు ప్రేమేందర్‌ అన్నారు. బుద్ద పౌర్ణిమను పురస్కరించుకుని భుక్తాపూర్‌లో ఏర్పాటు చేసిన బుద్ద పౌర్ణమి కార్యక్రమంలో ఆయన పాల్గొని బుద్ద ప్రతిమతో పాటు అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేశారు. ఆ తర్వాత పంచశీల జెండాను

గౌతమబుద్ధుడి మాటలు స్ఫూర్తిదాయకం
ప్రబుద్దనగర్‌ కాలనీలో గౌతమబుద్ద జయంతి వేడుకలు

ఆదిలాబాద్‌ టౌన్‌, మే 16: బుద్దభగవాన్‌ అడుగు జాడలు శాంతి స్థాపనకు బాటలు వేశాయని, గౌతమబుద్ద మాటలు నేటి సమాజానికి స్ఫూర్తిదాయకం అని మున్సిపల్‌ చైర్మన్‌ జోగు ప్రేమేందర్‌ అన్నారు. బుద్ద పౌర్ణిమను పురస్కరించుకుని భుక్తాపూర్‌లో ఏర్పాటు చేసిన బుద్ద పౌర్ణమి కార్యక్రమంలో ఆయన పాల్గొని బుద్ద ప్రతిమతో పాటు అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేశారు.  ఆ తర్వాత పంచశీల జెండాను ఆవిష్కరించి చైర్మన్‌ మాట్లాడారు. ఇందులో షెడ్యుల్‌ కులాల హక్కుల పరిరక్షణ అధ్యక్షుడు రత్నజాడే ప్రవీన్‌కుమార్‌, ఫ్లోర్‌ లీడర్‌బండారి సతీష్‌, కౌన్సిలర్‌ స్వాగత్‌, ఆర్‌.ఉదయ్‌కుమార్‌, తాడేరవి, షీలాబాయ్‌, తాడేపూజ, వందనాజాడే, బావురావు, తదితరులు పాఒల్గన్నారు. 

ఇంద్రవెల్లి: ప్రపంచానికే అహింస మార్గాన్ని చూపిన మహాత్ముడు బుద్దుడు అని, ఆయన  మార్గంలో ప్రతీఒక్కరు నడవాలని ఎంపీపీ పోటే శోబాబాయి, జడ్పీటీసీ ఆర్క పుష్పలతలు పేర్కొన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ప్రబుద్దనగర్‌ కాలనీలో బుద్ద జయంతిని ఘనంగా నిర్వహించారు. ఇందులో మాజీ సర్పంచ్‌ కోరెంగ సుంకట్‌రావు, మాజీ అధ్యక్షుడు సోన్‌కంబ్లే మనోహర్‌, బీఎస్పీ అధ్యక్షుడు మీర్జా ఆరీఫ్‌బేగ్‌, వంచీత్‌ బహుజన అఘాడి పార్టీ అధ్యక్షుడు సోన్‌కాంబ్లే బాబాసాహెబ్‌, తదితరులు ల్గొన్నారు.  

బోథ్‌: మండలంలో సోమవారం బుద్ద భగవానుడి జయంతి వేడుకలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. బోథ్‌, సోనాల గ్రామాలలో బుద్దుడి చిత్రపటానికి పూజలు నిర్వహించి జయంతి వేడుకలు జరుపుకున్నారు. ఇందులో అంబేద్కర్‌ యువజన సంఘం మండల అధ్యక్షుడు కందిప్రవీన్‌, ప్రధాన కార్యదర్శి బత్తుల రమేష్‌, బౌద్ధ మహాసభ అధ్యక్షులు అమృత్‌రావ్‌, తదితరు పాల్గొన్నారు. 

గుడిహత్నూర్‌: మండల కేంద్రంలోని జైభీంనగర్‌ బుద్ద విహార్‌లో బుద్ద జయంతి ఘనంగా నిర్వహించారు. ఇందులో మస్కేమాదవ్‌, బుద్దెగోవింద్‌, ససానే మాధవ్‌, బుద్దెకిషన్‌, జోందలే వినోద్‌, తదితరులు పాల్గొన్నారు. 

నార్నూర్‌: నార్నూర్‌, గాదిగూడ మండలాల్లోని ఆయా గ్రామాల్లో బుద్ద పౌర్ణిమను పురస్కరించుకోని బుద్ద జయంతిని ప్రజలు ఘనంగా నిర్వహించారు. 

Updated Date - 2022-05-17T06:22:40+05:30 IST