గ్రామ పంచాయతీలకు నిధుల గండం

ABN , First Publish Date - 2022-12-06T22:25:01+05:30 IST

పల్లెలు దేశాభివృద్ధికి పట్టుకొమ్మలని పాలకులు చెబుతున్న మాటలు ప్రకటనలకే పరిమితమవుతున్నాయి. నిధుల కొరతతో గ్రామాల్లో అభివృ ద్ధి పనులు ముందుకు సాగని దుస్థితి నెలకొంది. తాగునీటి బోర్ల మర మ్మతు, పారిశుధ్యం వంటి ఇతర పనులు చేపట్టాలన్నా ప్రభుత్వం నుం చి నిధులు మంజూరు కాకపోవడంతో పాలకవర్గానికి ఇబ్బందులు తప్పడం లేదు.

గ్రామ పంచాయతీలకు నిధుల గండం
లోగో

- భారంగా మారిన సిబ్బంది వేతనాలు, ట్రాక్టర్ల ఈఎంఐల చెల్లింపు

- ఇబ్బందులు పడుతున్న సర్పంచ్‌లు

పల్లెలు దేశాభివృద్ధికి పట్టుకొమ్మలని పాలకులు చెబుతున్న మాటలు ప్రకటనలకే పరిమితమవుతున్నాయి. నిధుల కొరతతో గ్రామాల్లో అభివృ ద్ధి పనులు ముందుకు సాగని దుస్థితి నెలకొంది. తాగునీటి బోర్ల మర మ్మతు, పారిశుధ్యం వంటి ఇతర పనులు చేపట్టాలన్నా ప్రభుత్వం నుం చి నిధులు మంజూరు కాకపోవడంతో పాలకవర్గానికి ఇబ్బందులు తప్పడం లేదు.

ఆసిఫాబాద్‌రూరల్‌, డిసెంబరు 6: ప్రభుత్వం సాయం అందక గ్రా మపంచాయతీలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులు నెలల తరబడి నిలిచిపోవడంతో గ్రామాల్లో ఆభివృద్ధి పనులకు ఆటంకం కలుగుతోంది. ట్రాక్టర్ల ఈఎం ఐలు, సిబ్బంది వేతనాలు కూడా నిధులు లేక పోవడంతో పెండింగ్‌లో పడిపోయాయి. 15వ ఆర్థిక సంఘం నిధులను నేరుగా గ్రామపంచాయ తీ ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించారు. దీంతో గ్రామ పంచా యతీలు ప్రత్యేక ఖాతాలు ప్రత్యేక ఖాతాలు ప్రారంభించాయి. కాగా నేటికి నిధులు జమ కాలేదు. ఇక రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా నాలు గు నెలల నుంచి నిధులు విడుదల కావడంలేదు.

జిల్లాలో 335 పంచాయతీలు..

జిల్లాలో 335 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇందులో ఆసిఫాబాద్‌, సిర్పూర్‌(టి), రెబ్బెన, గోలేటి, కౌటాల, బెజ్జూరు, జైనూరు, వాంకిడి మేజర్‌ పంచాయతీలు ఉన్నాయి. మిగితావి చిన్న పంచాయతీలే కావడం గమనార్హం. గ్రామపంచాయతీలకు ఇంటి పన్నులతో పాటు ఇతరత్రా ఆ దాయం ఆరకొరగా వస్తుండడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరు చేస్తున్న నిధుల కోసం ఎదురు చూడక తప్పడంలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు నిలిచి పోవడంతో గ్రామ పంచాయతీల ఖాజానా ఖాళీ అయింది. ఆదాయ వనరులు ఉన్న పంచాయతీల్లో మినహ చాలా గ్రామపంచాయతీలు గత రెండు, మూడు నెలలుగా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుక్కొంటున్నాయి. కార్మికుల వేతనాలు కూడా ఇవ్వని దుస్థితి నెలకొంది. వేతనాలకు సంబంధించిన చెక్కులు ట్రెజరీ కార్యాలయంలో అందించినప్పటికీ నిధులు లేకపోవడంతో విడుదల కావడంలేదు. విద్యుత్‌ దీపాల ఏర్పాటు, శానిటేషన్‌, విద్యుత్‌ బిల్లుల చెల్లింపులు, తాగునీటి పైపులైన్‌ మరమ్మతులు తదితర పనులు ఏమి చేపట్టలేకపోతున్నారు. ప్రజల ఒత్తిడి మేరకు కొంతమంది సర్పంచ్‌లు తమసొంత డబ్బులతో వివిధ పనులు చేపట్టారు. వాటికి సంబంధించిన బిల్లులు కూడా ఇంకా పెండింగ్‌లోనే ఉండడంతో తలలు పట్టుకుం టున్నారు. ఇదిలా ఉండగా ట్రాక్టర్ల కిస్తీలు తలనొప్పిగా మారాయి. పం చాయతీల్లో వసూలయ్యే ఆస్తి పన్నులతోనే అన్ని పనులు చేయడం అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఇబ్బందికరంగా మారింది.

పనులు చేయలేక పోతున్నాం..

- జాబరి అరుణ, సర్పంచ్‌, గుండి

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు రాక పోవడంతో పనులు చేప ట్టలేక పోతున్నాం. పైపులైన్‌ లీకేజీలకు మరమ్మతులు, పారిశుధ్య పను లు తదితర చిన్నచిన్న పనులకు కూడా ఇబ్బంది అవుతుంది. కార్మికుల కు వేతనాలు చెల్లించ లేక పోతున్నాం. ఆస్తి పన్ను కూడా తక్కువగానే వసూలు అవుతోంది. అరకొర నిధులతో ఇబ్బందులు పడుతున్నాం.

ఇబ్బందులు పడుతున్నాం..

-పెద్దపల్లి శ్రీనివాస్‌, సర్పంచ్‌, రహపల్లి

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు మంజూరు కాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం. ట్రాక్టర్‌ ఈఎంఐలు, డీజిల్‌ బిల్లులు, వర్కర్లకు వేతనాలు, సీసీ ఛార్జీలతో పాటు గ్రామ పంచాయతీ నిర్వహణ భారమ వుతోంది. పంచాయతీల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటిక ప్పుడు నిధులు మంజూరు చేయాలి.

Updated Date - 2022-12-06T22:25:02+05:30 IST