పవర్‌గూడలో చిరుధాన్యాల ఆహార పండుగ

ABN , First Publish Date - 2022-09-30T04:01:34+05:30 IST

మండలంలోని పవర్‌గూడ గ్రామపంచాయ తీలో గురువారం జిల్లా శిశుసంక్షేమశాఖ వారు చిరుధాన్యాల ఆహారపండుగ నిర్వహించారు.

పవర్‌గూడలో చిరుధాన్యాల ఆహార పండుగ
చిరుధాన్యాలతో ట్రైనీ ఐఏఎస్‌ అధికారులు

సిర్పూర్‌(యూ), సెప్టెంబరు 29: మండలంలోని పవర్‌గూడ గ్రామపంచాయ తీలో గురువారం జిల్లా శిశుసంక్షేమశాఖ వారు చిరుధాన్యాల ఆహారపండుగ నిర్వహించారు. గ్రామాల్లో పెరుగుతున్న ఆరోగ్యసమస్యలను నివారించడానికి చిరు ధాన్యాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. ట్రైనీకలెక్టర్లు శివాని, మొహమ్మద్‌ అబ్దుల్‌ రవూఫ్‌శేక్‌, పంకజ్‌ గుజర్‌, పేమా, శ్రీస్తి సింగ్‌,యక్ష్‌ చౌదరి,సర్పంచ్‌ ప్రహ్లాద్‌, ఐసీడీఎస్‌ సీడీపీవో ఇందిర, వాసన్‌ సంస్థ సభ్యులు పాల్గొన్నారు.

జైనూరు: మండలంలోని జంగాం, కొలాంగూడ, కోహినూర్‌ గ్రామాల్లో చిరుఽ దాన్యపంటలను గురువారం ట్రైనీ సివిల్‌సర్వీస్‌ అధికారులు సందర్శించారు. పంటపొలాల్లో పర్యటించి సాగువిధానం తదితరాలను అడిగి తెలుసుకున్నారు.

Read more