ట్రాఫిక్‌ నియమాలను పాటించాలి : ఎస్పీ

ABN , First Publish Date - 2022-02-23T06:27:59+05:30 IST

రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ప్రతిఒక్కరూ తప్పనిసరిగా ట్రాపిక్‌ నియమాలు పాటించాలని ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని సూర్యా గార్డెన్‌లో ఏర్పాటు చేసిన సమావే శంలో ప్రజలకు అవగాహన కల్పించారు.

ట్రాఫిక్‌ నియమాలను పాటించాలి  : ఎస్పీ
మాట్లాడుతున్న ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి

నేరడిగొండ, ఫిబ్రవరి 22: రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ప్రతిఒక్కరూ తప్పనిసరిగా ట్రాపిక్‌ నియమాలు పాటించాలని ఎస్పీ  ఉదయ్‌కుమార్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని సూర్యా గార్డెన్‌లో ఏర్పాటు చేసిన సమావే శంలో ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంలగా ఆయన మాట్లాడు తూ రోడ్డు ప్రమాదాలు జిల్లా ద్విచక్రవాహానాలే అవుతున్నాయన్నారు. ఇందులో చాలామంది మద్యం తాగి వాహనాలు నడపడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. లైసెన్స్‌లు లేకుండా, త్రిబుల్‌ సీట్‌లు నడుపుతున్నారన్నారు మార్చి ఒకటి నుంచి జిల్లావ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ప్రత్యేక కార్యాచర ణ చేస్తామన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ హర్షవర్ధన్‌, జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్‌, మోటార్‌ వెహికిల్‌ ఇన్స్‌పెక్టర్‌ శ్రీనివాస్‌, ఇచ్చోడ సీఐ రమేష్‌బాబు,  ఎస్సై మహేందర్‌, ఎంపీపీ రాథోడ్‌ సజన్‌, తదితరులు పాల్గొన్నారు.

Read more