నూతన ఆవిష్కరణలపై దృష్టి సారించాలి

ABN , First Publish Date - 2022-12-07T22:11:59+05:30 IST

విద్యార్ధుల నూతన ఆవిష్కరణలపై దృష్టి సారించాలని డీఈవో వెంకటేశ్వర్లు అన్నారు.

 నూతన ఆవిష్కరణలపై దృష్టి సారించాలి
మాట్లాడుతున్న డీఈవో వెంకటేశ్వర్లు

ఏసీసీ, డిసెంబరు 7: విద్యార్ధుల నూతన ఆవిష్కరణలపై దృష్టి సారించాలని డీఈవో వెంకటేశ్వర్లు అన్నారు. జిల్లా కేంద్రంలోని జడ్పీ సమావేశ మందిరంలో బుధవారం స్కూల్‌ ఇన్నోవేషన్‌ చాలెంజ్‌ 2022 నిర్వహణ ఇన్‌చార్జిలకు నిర్వహించిన ఒక్క రోజు శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పాఠశాల స్థాయి విద్యార్థులు నూతన ఆవిష్కరణలు తయారు చేసేలా ప్రేరేపించాలని సూచించారు. ఇన్నోవేషన్‌ చాలెంజ్‌ టీం సభ్యులు తరుణ్‌, యశ్వంత్‌ విద్యార్థుల టీముల రిజిస్ర్టేషన్‌, ఐడియాలజీ సమ్మిట్‌పై అవగాహన కల్పించారు. జిల్లాలోని 130 పాఠశాలల నుంచి ఐదుగురు విద్యార్ధుల చొప్పున టీముల రిజిస్ర్టేషన్‌ పూర్తి చేశారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్‌ అధికారి మధుబాబు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-07T22:12:01+05:30 IST