మానవ తప్పిదం వల్లనే వరదలు
ABN , First Publish Date - 2022-08-08T04:06:27+05:30 IST
మంచిర్యాల, నస్పూర్ పట్టణాల్లో వరదలు రావడానికి మానవ తప్పిదమే కారణమని ఇంజనీర్స్ ఫోరం సభ్యుడు పాత వెంకటరమణ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని గోదావరి వద్ద విలేకరులతో మాట్లాడు తూ సుందిళ్ల ప్రాజెక్టు బ్యాక్ వాటర్ మూలంగానే వరదలతో భారీ నష్టం ఏర్పడిందన్నారు.

ఏసీసీ, ఆగస్టు 7: మంచిర్యాల, నస్పూర్ పట్టణాల్లో వరదలు రావడానికి మానవ తప్పిదమే కారణమని ఇంజనీర్స్ ఫోరం సభ్యుడు పాత వెంకటరమణ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని గోదావరి వద్ద విలేకరులతో మాట్లాడు తూ సుందిళ్ల ప్రాజెక్టు బ్యాక్ వాటర్ మూలంగానే వరదలతో భారీ నష్టం ఏర్పడిందన్నారు. భవిష్యత్‌లో కూడా వరదలు వచ్చే ప్రమాదం ఉందన్నారు. వరదల నుంచి మంచిర్యాల పట్టణాన్ని, తోళ్లవాగు పరిసర ప్రాంత ప్రజలను కాపాడేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను చేపట్టాలని డిమాండ్ చేశారు. బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి తులా మధుసూదన్‌రావు, నాయకులు అశోక్ వర్దన్, బేర ప్రభాకర్, సత్యనారాయణ, సతీష్‌కుమార్ పాల్గొన్నారు.