పోడు భూములపై క్షేత్రస్థాయిలో అధికారుల సర్వే

ABN , First Publish Date - 2022-09-27T03:43:32+05:30 IST

అర్హులైన పోడు రైతులను గుర్తించి పత్రాలు ఇచ్చేం దుకు ఎఫ్‌ఆర్‌సీ (ఫారెస్టు రైట్స్‌ కమిటీ) ఆధ్వర్యంలో దేవాపూర్‌, సోనాపూర్‌ పంచాయతీల్లో ప్రాథమిక సర్వే పనులను చేపట్టారు. దరఖాస్తుదారుల పత్రాలను పరిశీలించి అటవీ భూమి సరిహద్దు లను గుర్తించారు. ఫారెస్టు డిప్యూటీ రేంజ్‌ ఆఫీసర్‌ ప్రవీణ్‌నా యక్‌ మాట్లాడుతూ 2005 డిసెంబరు 13లోపు సాగులో ఉన్న రైతులను అర్హులుగా గుర్తించేందుకు సర్వే చేస్తున్నామన్నారు.

పోడు భూములపై క్షేత్రస్థాయిలో అధికారుల సర్వే
దేవాపూర్‌లో సర్వే చేస్తున్న అధికారులు

బెల్లంపల్లి రూరల్‌, సెప్టెంబరు 26: ఆకెనపల్లి, పెర్కపల్లి గ్రామ పంచాయతీలలో పోడు రైతులకు పట్టాల  మంజూరు ప్రక్రియలో భాగంగా అటవీ, పంచాయతీ అధికారులు క్షేత్ర స్థాయిలో సర్వే చేశారు. మోకాపై ఉన్న పది మంది దర ఖాస్తుదారులకు సమాచారం అందించి మొబైల్‌ యాప్‌ ద్వారా జీపీఎస్‌ను వినియోగించి భూమి హద్దులు నమోదు చేశారు.  ఫారెస్టు బీట్‌ అధికారి రాజు, డిప్యూటీ ఎఫ్‌ఆర్‌వో గౌరిశంకర్‌, సర్పంచ్‌ పద్మావతి, కార్యదర్శులు వీరబాబు, శ్రీనివాస్‌, కోఆప్షన్‌ సభ్యులు అశోక్‌గౌడ్‌, ఎఫ్‌ఆర్‌సీ కమిటీ సభ్యులు, పాల్గొన్నారు.  

భీమిని: ఫారెస్టు, రెవెన్యూ, పంచాయతీరాజ్‌ శాఖల అధికా రులు సమన్వయంతో సర్వే నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని డీఎల్‌పీవో ఫణీందర్‌రావు పేర్కొన్నారు.  వడాల, కేస్లాపూర్‌, అక్కలపల్లి గ్రామాల్లో పోడు భూముల సర్వే నిర్వహించారు. తహసీల్దార్‌ పరమేశ్వర్‌రెడ్డి, ఆర్‌ఐ వెంకటేష్‌, ఎంపీవో సప్దర్‌ ఆలీ, ఫారెస్టు బీట్‌ అధికారి రవినాయక్‌, యుగంధర్‌, గోపికృష్ణ తదితరులు పాల్గొన్నారు. 

భీమారం: ధర్మారం, బూరుగుపల్లి గ్రామాల్లో పోడు భూములకు  అటవీ, ఎఫ్‌ఆర్‌సీ కమిటీలు, కార్యదర్శులు, రెవె న్యూ అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించారు. సర్పంచు చెడెంక లక్ష్మీ, రమాదేవిలు మాట్లాడుతూ పోడు భూ ముల సమస్యను సీఎం కేసీఆర్‌ పరిష్క రించడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఎఫ్‌ఆర్‌సీ కమిటీ చైర్మన్‌లు దాసరి మధునయ్య, సభ్యులు శ్రీనివాస్‌, మల్లేష్‌, శంకర్‌, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ రాజ్‌కుమార్‌,  ఎఫ్‌ఎస్‌వో విజయలక్ష్మీ, ఎఫ్‌బీవో రాజేందర్‌, పాల్గొన్నారు.

కాసిపేట: అర్హులైన పోడు రైతులను గుర్తించి పత్రాలు ఇచ్చేం దుకు ఎఫ్‌ఆర్‌సీ (ఫారెస్టు రైట్స్‌ కమిటీ) ఆధ్వర్యంలో దేవాపూర్‌, సోనాపూర్‌ పంచాయతీల్లో ప్రాథమిక సర్వే పనులను చేపట్టారు. దరఖాస్తుదారుల పత్రాలను పరిశీలించి అటవీ భూమి సరిహద్దు లను గుర్తించారు. ఫారెస్టు డిప్యూటీ రేంజ్‌ ఆఫీసర్‌ ప్రవీణ్‌నా యక్‌ మాట్లాడుతూ 2005 డిసెంబరు 13లోపు సాగులో ఉన్న రైతులను అర్హులుగా గుర్తించేందుకు సర్వే చేస్తున్నామన్నారు. రాంపూర్‌, చింతగూడెంలోని 32.13 ఎకరాల్లోని 13 మంది, సోనా పూర్‌ ఉమ్మడి పంచాయతీలో 154.13 ఎకరాల్లో సాగు చేసు కుంటున్న 26 మంది దరఖాస్తులను పరిశీలించామన్నారు. ఇన్‌ చార్జి ఎంపీడీవో శ్రీనివాస్‌, ఎంపీవో నాగరాజు, ఎఫ్‌ఆర్‌సీ కమిటీ చైర్మన్‌ రాందాస్‌, సర్పంచులు,  కార్యదర్శి, పాల్గొన్నారు.  

Read more