ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను విడుదల చేయాలి

ABN , First Publish Date - 2022-01-21T04:03:43+05:30 IST

రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ప్రభుత్వం వెంటనే విడు దల చేయాలని బీసీ విద్యా ర్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి సదావరి సాయితేజ డి మాండ్‌ చేశారు. గురువా రం చార్వాక హాలులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఇంజనీ రింగ్‌, బీఫార్మసీ పూర్తయిన విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదల కాకపోవడంతో కాలేజీ యాజ మాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నాయన్నారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను విడుదల చేయాలి
మాట్లాడుతున్న బీసీ విద్యార్థి సంఘం నాయకుడు

ఏసీసీ, జనవరి 20: రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ప్రభుత్వం వెంటనే విడు దల చేయాలని బీసీ విద్యా ర్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి సదావరి సాయితేజ డి మాండ్‌ చేశారు. గురువా రం చార్వాక హాలులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఇంజనీ రింగ్‌, బీఫార్మసీ పూర్తయిన విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదల కాకపోవడంతో కాలేజీ యాజ మాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నాయన్నారు. పెరి గిన ధరలకు అనుగుణంగా హాస్టల్‌ విద్యార్థులకు మెస్‌ చార్జీలను పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు. బీసీ గురుకుల హాస్టల్‌లకు సొంత భవనాల నిర్మాణానికి నిధులు విడుదల చేయాలన్నారు. సమావేశంలో నాయకులు రాజేష్‌, ప్రదీప్‌, సాయికుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-21T04:03:43+05:30 IST