ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదల చేయాలి

ABN , First Publish Date - 2022-12-07T22:09:56+05:30 IST

పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌, బకాయిలను వెంటనే విడుదల చేయాలని టీడీపీ పెద్దపల్లి పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు సంజయ్‌కుమార్‌, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు రవిందర్‌ డిమాండ్‌ చేశారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదల చేయాలి
అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌నాయక్‌కు వినతి పత్రం అందజేస్తున్న నాయకులు, విద్యార్థులు

ఏసీసీ, డిసెంబరు 7: పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌, బకాయిలను వెంటనే విడుదల చేయాలని టీడీపీ పెద్దపల్లి పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు సంజయ్‌కుమార్‌, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు రవిందర్‌ డిమాండ్‌ చేశారు. జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా నుంచి బుధవారం విద్యార్థులతో కలిసి ర్యాలీగా వెళ్లి కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌నాయక్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. స్కాలర్‌షిప్‌ బకాయిలు 3.300 కోట్లను వెంటనే విడుదల చేయాలన్నారు. విద్యార్ధి నాయకుడిగా అసెంబ్లీలో అడుగు పెట్టిన ఎమ్మెల్యే బాల్క సుమన్‌ ఒక్క రోజు కూడా విద్యార్థుల సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడలేదని చెప్పారు. రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఆధారపడి చదువుకుంటున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ విద్యార్థులను విద్యకు దూరం చేసే దురుద్దేశంతో ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. ప్రభుత్వం ఇప్పటికైనా పెండింగ్‌ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నాయకులు సాగర్‌, శివగౌడ్‌, సంపత్‌, సాయిరాం, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-07T22:09:58+05:30 IST