రైతులకు నష్టపరిహారం అందించాలి

ABN , First Publish Date - 2022-08-05T04:04:12+05:30 IST

ఇటీవల కురిసిన భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తక్షణ సాయంగా రూ.50వేలు అందించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘనాథ్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. రైతుల గోస బీజేపీ భరోసాలో భాగంగా దండేపల్లిలో గురువారం బస్టాండ్‌ వద్ద రాస్తారోకో చేపట్టారు. అనంతరం బస్టాండ్‌ నుంచి అంబేద్కర్‌ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్‌ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్‌కు వినతిపత్రాన్ని సమర్పించారు.

రైతులకు నష్టపరిహారం అందించాలి
దండేపల్లిలో రాస్తారోకో చేస్తున్న బీజేపీ నాయకులు, రైతులు

దండేపల్లి, ఆగస్టు 4: ఇటీవల కురిసిన భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తక్షణ సాయంగా రూ.50వేలు అందించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘనాథ్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. రైతుల గోస బీజేపీ భరోసాలో భాగంగా దండేపల్లిలో గురువారం బస్టాండ్‌ వద్ద రాస్తారోకో చేపట్టారు. అనంతరం బస్టాండ్‌ నుంచి అంబేద్కర్‌ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్‌ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్‌కు వినతిపత్రాన్ని సమర్పించారు. ఆయన మాట్లాడుతూ భారీ వర్షాలకు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో పంటలు దెబ్బతిన్నాయని, కడెం ప్రాజెక్టు, గూడెం, నం బాల, కాసిపేట గ్రామాల్లో ఎత్తిపోతల పథకాలు దెబ్బతిన్నాయన్నారు. ముంపు ప్రాంతాల్లో పర్యటించాల్సిన బాధ్యత సీఎం కేసీఆర్‌పై లేదా అని ప్రశ్నించారు.  అధికారుల అనాలోచిత చర్యల వల్ల కడెం ఆయకట్టు రైతుల పరిస్థితి ఆగమ్య గోచరంగా తయారైందన్నారు. ప్రభుత్వం వరదలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, కడెం ప్రాజెక్టు, గూడెం ఎత్తిపోతల పథకాలకు మరమ్మతు చేపట్టి  సాగునీరు అందించాలని డిమాండ్‌ చేశారు. బీజేపీ మండల అధ్యక్ష కార్యదర్శు గోపతి రాజయ్య, బందెల రవిగౌడ్‌, నాయకులు రజినేష్‌జైన్‌, జీవీ ఆనంద్‌కృష్ణ, గుండ ప్రభాకర్‌, తిరుపతి, కిషన్‌, రవీందర్‌, రాజేశ్వరీ, సుగుణ పాల్గొన్నారు. 

 

Updated Date - 2022-08-05T04:04:12+05:30 IST