ఉత్కంఠగా.. ప్లాట్ల వేలం

ABN , First Publish Date - 2022-11-14T23:25:30+05:30 IST

జిల్లా కేంద్రంలో రాజీవ్‌ స్వగృహలో ప్లాట్ల వేలం ఉత్కంఠగా కొనసాగింది. కొన్ని రోజు లుగా ఈ ప్లాట్ల వేలం కోసం డీడీలు చెల్లించిన దరఖా స్తుదారులు సోమవారం ఉదయం స్థానిక జనార్దన్‌రెడ్డి గా ర్డెన్‌లో నిర్వహించిన రాజీవ్‌ స్వగృహ ఇళ్ల వేలం పాటకు నిబంధనల మేరకు హాజరయ్యారు.

ఉత్కంఠగా.. ప్లాట్ల వేలం
వేలానికి పెద్దఎత్తున హాజరైన దరఖాస్తుదారులు

వేలంలో పాల్గొన్న 70శాతం ఉపాధ్యాయులు

దిక్కును బట్టి పెరిగిన ధర

అత్యధికంగా చదరపు గజానికి రూ.17,100

వేలం పాట వద్ద భారీ బందోబస్తు

వేలంలో పాల్గొన్న 900 మంది దరఖాస్తుదారులు

ఆదిలాబాద్‌టౌన్‌, నవంబరు14: జిల్లా కేంద్రంలో రాజీవ్‌ స్వగృహలో ప్లాట్ల వేలం ఉత్కంఠగా కొనసాగింది. కొన్ని రోజు లుగా ఈ ప్లాట్ల వేలం కోసం డీడీలు చెల్లించిన దరఖా స్తుదారులు సోమవారం ఉదయం స్థానిక జనార్దన్‌రెడ్డి గా ర్డెన్‌లో నిర్వహించిన రాజీవ్‌ స్వగృహ ఇళ్ల వేలం పాటకు నిబంధనల మేరకు హాజరయ్యారు. ఉదయం 9.30గంటల నుంచి ప్రారంభమైన ఈ వేలం పాట సాయంత్రం 8 గం టల వరకు కొనసాగింది. సుమారు 900 మంది దరఖాస్తు దారులు పాల్గొన్నారు. సర్కారు వారీ పాట గజానికి రూ.8 వేలు నిర్ణయించగా దిక్కును బట్టి ప్లాటుకు ఒక్కో చదరపు గజానికి వేలంలో రేటు రూ.11వేల నుంచి రూ.14వేల వరకు పెంచుతూ పోయారు. దీంతో కొంత మంది దరఖాస్తుదా రులు ఊహంచిన దానికంటే చదరపు గజం రేటు అమాం తం పెరగడంతో వారి అంచనా తారుమారైంది. దీంతో వారు వేలంలో వెనుకడుగు వేశారు.

362 ప్లాట్లకు వేలం..

జిల్లా కేంద్రంలోని రాజీవ్‌ స్వగృహాలోని 362 ప్లాట్లకు వేలం పాట నిర్వహించారు. ఈ నెల 14 నుంచి 18 వరకు వేలం పాటను నిర్వహించేందుకు జిల్లా కేంద్రంలోని జనార్దన్‌ రెడ్డి గార్డెన్‌లో అధికార యంత్రాంగం ఏర్పాట్లను పూర్తి చేసింది. వేలం పాట ప్రారంభానికి ముందు బ్యాంకు అధికారులు ప్రత్యేక కౌంటర్‌లను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోలేని వారు, డీడీని చెల్లించలేని వారి కోసం స్థానికంగానే ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి డీడీలు స్వీకరించారు. దీంతో ఆదివారం వరకు 589 దరఖాస్తులు వచ్చి ఉండగా వేలం పాట రోజున స్థానికంగా ఏర్పాటు చేసిన కౌంటర్ల వద్ద తీసుకున్న దరఖాస్తులు కలిపి మొత్తం సుమారు 900 వరకు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఆసక్తి గల కొనుగోలుదారులు అక్కడే దరవత్తు సొమ్మును చెల్లించి వేలం పాటలో పాల్గొనే అవకాశం కల్పించారు. మావల మండలంలోని బట్టిసావర్గామ గ్రామపంచాయతీ పరిధిలో గల దుబ్బగూడ సమీపంలో ఈ లేఅవుట్‌ను ఏర్పాటు చేశారు.

రూ.4కోట్లతో అభివృద్ధి పనులు..

మావల మండలం బట్టిసావర్గామ సమీపంలో గల రాజీవ్‌ స్వగృహ ఓపెన్‌ ప్లాట్ల అభివృద్ధి పనులు అధికార యంత్రాంగం రూ.4కోట్లతో చేపట్టింది. ప్రస్థుతం అధికారులు ప్లాటు విస్తీర్ణం, ఇంటి స్థలం చదరపు గజాలు, నెంబర్లు ఏర్పాటు చేశారు. ప్లాట్లను సొంతం చేసుకున్న వారికి ఎలాం టి అసౌకర్యాలు లేకుండా స్వయంగా కలెక్టర్‌ పర్యవేక్షణ చేస్తున్నారు. 44వ జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ఈ అగ్రజా లేఅవుట్‌లో ఈస్ట్‌, వెస్ట్‌, సౌత్‌ ఫేసులు గల ఇళ్ల స్థలాలను బట్టి వాటి చదరపు గజాలను ఏర్పాటు చేశారు.

వేలంలో 70శాతం ఉపాధ్యాయులే..

రాజీవ్‌ స్వగృహ ఓపెన్‌ ప్లాట్ల వేలంలో ఊహించి నట్లుగానే ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నారు. మొత్తం 900 మంది దరఖాస్తుదారులు ఉండగా ఇందులో సుమారు 70శాతం ప్రభుత్వ ఉపాధ్యాయులే ఉండడం గమనార్హం. వీరి చేరికతో ఓపెన్‌ ప్లాట్ల వేలం రసవ త్తరంగా మారింది. అప్పటి వరకు సర్కారు వారి పాట చదరపు గజానికి రూ.8వేలు ఉండగా అందరు ఒకటి లేదా రెండు ఇళ్ల స్థలాలను సొంతం చేసుకోవాలని భా వించారు. కానీ కొద్ది సేపటికే దీని ధర అమాంతంగా పెరిగి పోవడంతో ఈ వేలం ఉత్కంఠకు దారి తీసింది. ఈస్ట్‌ ఫేస్‌ ఇంటి స్థలానికి రిజిస్ర్టేషన్‌ కలుపుకుని రూ. 30 నుంచి రూ.32లక్షలు, వేస్ట్‌ ఫేస్‌కు పెరిగిన చదరపు ధరతో రూ.25 నుంచి రూ. 26లక్షలు, సౌత్‌ఫేస్‌ ఇంటి స్థలానికి రూ.20 నుంచి రూ.23 లక్షలు పలికింది. దీంతో అప్పటి వరకు సొంతింటి కలను సాకారం చేసుకుందామను కున్న అనేక మంది దరఖాస్తుదారులు ఉపాధ్యాయుల ఎం ట్రీతో సీను మారింది. సుమారు 70శాతం మంది ఉపాధ్యాయులే పోటీ పడి వేలంలో పాల్గొని మొదటి రోజు రికార్డు స్థాయిలో రూ.17,100 చొప్పున గజానికి వేలం పాట పాడడంతో రెండో రోజు మంగళవారం ఈ వేలం ఎలా ఉంటుందోనని ఆసక్తి నెలకొంది.

గజానికి రికార్డు ధర..

ఓపెన్‌ ప్లాట్ల వేలం అధికారులు ఊహించని దాని కంటే ఉత్కంఠగా సాగింది. చదరపు గజానికి ప్రభుత్వం వారు నిర్ణయించిన రూ.8వేలతో వేలం ప్రారంభంకాగా కొద్ది సేపటికే గజానికి రూ.11, రూ.12, రూ.13, రూ.14వేల చొప్పున పెరిగింది. ధర పెరిగి పోతుండడంతో కొంత మంది దరఖాస్తుదారులు ప్లాటుకు చెల్లించే మొత్తం ధరతో పాటు రిజిస్ర్టేషన్‌కు అయ్యే ఖర్చులను దృష్టిలో ఉంచుకుని వేలం నుంచి తప్పుకున్నారు.

వేలం పాట వద్ద భారీ బందోబస్తు..

మావల మండలం బట్టిసార్గామ పంచాయతీ పరిధిలో గల రాజీవ్‌ స్వగృహ ఓపెన్‌ ప్లాట్ల వేలం నిర్వహించగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ ఆదేశాల మేరకు పోలీసు యంత్రాం గం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Updated Date - 2022-11-14T23:25:32+05:30 IST