కుష్టు వ్యాధి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
ABN , First Publish Date - 2022-12-15T22:44:40+05:30 IST
కుష్టువ్యాధి నిర్మూలకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని కుష్టు వ్యాధి నిర్మూలన సర్వే రాష్ట్ర పరిశీలకుడు డాక్టర్ సంపత్ అన్నారు.
మంచిర్యాల కలెక్టరేట్, డిసెంబరు 15: కుష్టువ్యాధి నిర్మూలకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని కుష్టు వ్యాధి నిర్మూలన సర్వే రాష్ట్ర పరిశీలకుడు డాక్టర్ సంపత్ అన్నారు. గురువారం జాతీయ కుష్టు నిర్మూలన పక్షోత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలో పద్మశాలి కాలనీ, సాయికుంట, హమాలీవాడ, అంబేద్కర్ కాలనీ, వికా స్నగర్ ప్రాంతాల్లో సర్వే, అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఆయన మాట్లాడు తూ లెప్రసీ వ్యాధిని ఎండిటి ద్వారా నివారించవచ్చని, మైక్రో బాక్టీరియాలేఫ్రీ అనే సూక్ష్మక్రిముల ద్వారా సంక్రమించే వ్యాధన్నారు. వ్యాధిగ్రస్తులకు శరీరం పాలిపోయి రాగి రంగు మచ్చలు, స్పర్శ లేకపోవడం, పాదాలు, చేతివేళ్లు తిమ్మి ర్లు వంటి లక్షణాలుంటాయన్నారు. బహుళ ఔషధ చికిత్స ద్వారా వ్యాధిని అరికట్టువచ్చన్నారు. డిప్యూటీ పారామెడికల్ అధికారులు మొగిళి, శివకుమార్, రాఘవయ్య, ప్రభాకర్, రమేష్, డెమో వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.