అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి

ABN , First Publish Date - 2022-12-07T22:16:24+05:30 IST

మండల అభివృద్ధిలో ప్రజాప్రతినిధులు, అధికారులు అందరు భాగస్వాములు కావాలని జడ్పీ చైర్‌పర్సన్‌ నల్లాల భాగ్యలక్ష్మి అన్నారు.

అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి
మాట్లాడుతున్న జడ్పీ చైర్‌పర్సన్‌ నల్లాల భాగ్యలక్ష్మి

కోటపల్లి, డిసెంబరు 7 : మండల అభివృద్ధిలో ప్రజాప్రతినిధులు, అధికారులు అందరు భాగస్వాములు కావాలని జడ్పీ చైర్‌పర్సన్‌ నల్లాల భాగ్యలక్ష్మి అన్నారు. కోటపల్లి మండల పరిషత్‌ కార్యాలయంలో బుధవారం ఎంపీపీ మంత్రి సురేఖరామయ్య అధ్యక్షతన నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశానికి హాజరై పలు సూచన లు చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ అధికారులు, ప్రజాప్రతినిధులు పరస్పర సహకారంతో సమన్వయంతో పనిచేసినప్పు డే మండలం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. అంతకు ముందు వ్యవసాయ, విద్యుత్‌, విద్య, రవాణా, ఐసీడీఎస్‌, పంచాయతీ రాజ్‌, రెవెన్యూ తదితర శాఖలకు సంబంధించిన ప్రగతి నివేదికలను ఆయా శాఖల అధికారులు చదివి వినిపించారు. కార్యక్రమంలో ఎంపీడీవో భాస్కర్‌, ఎంఈవో తిరుపతిరెడ్డి, విద్యుత్‌ ఏఈ వెంకటేశ్వర్‌, ఏవో మహేందర్‌, పశువైద్యాధికారి పవన్‌కుమార్‌, ఆర్‌డబ్య్లూఎస్‌ ఏఈ బద్రినాధ్‌ స్వామి అధికారులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-07T22:16:26+05:30 IST