ప్రతీఒక్కరు భాగస్వాములు కావాలి : కలెక్టర్‌

ABN , First Publish Date - 2022-11-28T01:13:52+05:30 IST

భారత ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు ఆరోగ్యవంతమైన ఓటరు జాబితాను తయారు చేసేందుకు ప్రతి ఒక్కరు భాగ స్వాములు కావాలని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి సిక్తాపట్నాయక్‌ అన్నారు.

ప్రతీఒక్కరు భాగస్వాములు కావాలి : కలెక్టర్‌
ఓటరు నమోదు కార్యక్రమాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌

ఆదిలాబాద్‌ టౌన్‌, నవంబరు 27: భారత ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు ఆరోగ్యవంతమైన ఓటరు జాబితాను తయారు చేసేందుకు ప్రతి ఒక్కరు భాగ స్వాములు కావాలని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి సిక్తాపట్నాయక్‌ అన్నారు. ఆదివారం పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎస్టీ పోస్టుమెట్రిక్‌ బాలికల వస తి గృహంలోని పోలింగ్‌ కేంద్రాలను ఆమెపరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బూత్‌స్థాయి అధికారులు వారి పరిధిలోని ప్రదేశాల్లో నివసిస్తున్న 18ఏళ్ల వయస్సు నిండిన వారి పేరును ఓటరు జాబితాలో నమోదు చేయాలన్నా రు. జనవరి 1, 2023 నాటికి 18ఏళ్లు నిండిన వ్యక్తి ఓటరు జాబితాలో ఉండే విధంగా విస్త్రృత ప్రచారం నిర్వహించి ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరించి ఓట రుగా నమోదు చేయాలన్నారు. ఈ నెల 26, 27 తేదీల్లో ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్‌ కేంద్రాల్లో హాజరై ఓటరు జాబితా లో నమోదు, మార్పులు, చేర్పులు అంశాలకు సంబంధించి నిర్ణిత ఫారాలను సేక రించడం జరుగుతుందని తెలిపారు. కొత్త ఓటర్ల నమోదుతో పాటు మరణించిన, ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయిన వారి వివరాలను, పత్రాలను సేకరించి ఓటరు జాబితా నుంచి పేర్లను తొలగించేందుకు ప్రతిపాదించాలని సూచించారు. ఎన్నిక ల కమిషన్‌ ఆదేశాల మేరకు చేపడుతున్న ఈ కార్యక్రమం ద్వారా ప్రజలను చైత న్యవంతులను చేసి వందశాతం ఓటరు నమోదు జరిగేలా అవగాహన కల్పించా లన్నారు. ఇందులో ఆర్డీఓ రాథోడ్‌రమేష్‌, జిల్లా పౌరసంబంధాల అధికారి ఎన్‌. భీమ్‌కుమార్‌, తహసీల్దార్‌ సతీష్‌, స్వీప్‌ నోడల్‌ అధికారి లక్ష్మణ్‌, నాయబ్‌ తహసీ ల్దార్‌ సాయిమహేశ్‌, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

ఉట్నూర్‌: ఓటు హక్కు అర్హత వచ్చిన వారు ప్రతీఒక్కరు తమ ఓటరు నమోదును చేసుకోవాలని ఉట్నూర్‌ తహసీల్దార్‌ బోజన్న అన్నారు. ఆదివారం మండలంలోని బూత్‌లెవల్‌ సెంటర్లను ఆయన తనిఖీ చేశారు. బూత్‌ లెవల్‌ అదికారులు ప్రతి ఒక్కరు తమకు నిర్ణయించిన కేంద్రాలలో ఓటరు నమోదు చేయించాలని ఆయన పేర్కొన్నారు.

బోథ్‌: మండల కేంద్రంలోని ప్రత్యేక ఓటరు నమోదు కేంద్రాన్ని ఆదివారం తహసీల్దార్‌ అతికోద్దిన్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్కరిని ఓటరుగా నమోదు చేసుకోవాలని ఈ విష యంలో ప్రజలను మరింత చైతన్యం సూచించారు. ఆయన వెంట ఆర్‌ఐ దశరథ్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ శ్యాంసుందర్‌రెడ్డిలున్నారు.

నేరడిగొండ: నేరడిగొండ తహసీల్దార్‌ పవన్‌చంద్ర, ఆర్‌ఐ నాగోరావు జాతీయ ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా బుగ్గారాం గ్రామంలో కేంద్రాన్ని పరిశీ లించి మొచ్చుకుని పలు సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. 18 సంవత్స రాలు నిండిన ప్రతీఒక్కరు ఓటరు నమోదు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమం లో సర్పంచ్‌ గ్రామస్థులు పాల్గొన్నారు.

సిరికొండ: అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును కలిగి ఉండాలని మండ ల రెవెన్యూ ఇన్స్పెక్టర్‌ యజ్వేందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని సోం పల్లి, సిరికొండ, సుంకిడి, పొన్న, తదితర గ్రామాల్లోని పోలింగ్‌ కేంద్రాల్లో నిర్వహి స్తున్న ఓటరు నమోదు ప్రక్రియను ఆయన పరిశీలించారు. ఈ సందర్బంగా ప్రతీ ఇంటింటా సర్వే నిర్వహించి 18 ఏళ్లు నిండిన ఒక్కరూ విధిగా ఓటరుగా నమోదు చేసుకునేలా ఆయా పోలింగ్‌ కేంద్రాల్లోని యువతీ, యువకులకు అవగాహన కల్పించాలని ఆయన బీఎల్వోలకు సూచించారు.

తలమడుగు: అర్హులైన ప్రతీ ఒక్కరు ఓటు హక్కు కలిగి ఉండాలని తహసీ ల్దార్‌ ఇమ్రాన్‌ఖాన్‌ కోరారు. ఆదివారం మండలంలోని ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఓటు నమోదు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం కల్పించిన ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగపర్చుకోవాలని కోరారు. ప్రత్యేక ఓటరు నమోదుకేంద్రాల వద్ద ఓటు కలిగిన వారు తమ మొబైల్‌ నెంబర్‌ను లింకు చేసుకోవాలని కోరారు.

Updated Date - 2022-11-28T01:13:56+05:30 IST