సంక్షేమ పథకాలతో ప్రతీ కుటుంబం లబ్ధి
ABN , First Publish Date - 2022-05-29T04:09:48+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రతీ కుటుంబం లబ్ధి పొందుతుందని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పేర్కొన్నారు. శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 30 మంది లబ్ధిదారులకు రూ. 30,03,480 విలువ గల కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ పథకాలతో నిరుపేద యువతుల వివాహాలు సం తోషంగా జరుగుతున్నాయని తెలిపారు.

బెల్లంపల్లి, మే 28: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రతీ కుటుంబం లబ్ధి పొందుతుందని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పేర్కొన్నారు. శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 30 మంది లబ్ధిదారులకు రూ. 30,03,480 విలువ గల కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ పథకాలతో నిరుపేద యువతుల వివాహాలు సం తోషంగా జరుగుతున్నాయని తెలిపారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. జడ్పీ వైస్ చైర్మన్ సత్యనారాయణ, ఎంపీపీ గోమాస శ్రీనివాస్, తహసీల్దార్ కుమారస్వామి, డిప్యూటీ తహసీల్దార్ మాణిక్రావు, మున్సిపల్ చైర్పర్సన్ శ్వేత, వైస్ చైర్మన్ సుదర్శన్, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.