ఆర్జీయూకేటీలో ఇంధన పొదుపు దినోత్సవం
ABN , First Publish Date - 2022-12-15T02:11:21+05:30 IST
బాసర ఆర్జీయూకేటీలో బుధవారం ఇంధన పొదుపు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
బాసర, డిసెంబరు, 14 : బాసర ఆర్జీయూకేటీలో బుధవారం ఇంధన పొదుపు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చేపట్టిన 2 కేవాక్ కార్యక్రమంలో విద్యార్థులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సంద ర్భంగా డైరెక్టర్ సతీష్‌కుమార్ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ఇంధన వినియోగం పెరిగిపోతుందని ఫలితంగా పర్యావరణంపై ప్రతికూల ప్రభా వం పడుతుందని అన్నారు. ఇంధన వనరులను అవసరాల మేరకే విని యోగించుకోవాలని చెప్పారు. ఇంధన పొదుపును అన్ని వర్గాల వారు అల వర్చుకోవాలని సూచించారు. యూనివ ర్సిటీలో ప్రతి నెలా రూ.5 లక్షల మేరకు విద్యుత్ పొదుపు చేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ డా.చంద్రశేఖర్, అసోసియేట్ డీన్‌లు నామిని, రాకేష్, దత్తు, అధ్యాపకులు నరేంధర్, ప్రభాకర్, పాల్గొన్నారు