విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి

ABN , First Publish Date - 2022-09-18T04:39:37+05:30 IST

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు జైన్‌ అన్నారు. అర్చన టెక్స్‌ చౌరస్తాలో జాతీయ జెండాను ఎగురవేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల విముక్తి కలిగించిన ఘనత సర్దార్‌ వల్లాభాయ్‌పటేల్‌కు దక్కుతుందన్నారు. ప్రధాని సూచన మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా విమోచన దినోత్సవాన్ని కేంద్రం తరుపున అధికారికంగా నిర్వహించడం ప్రజల అదృష్టమన్నారు.

విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి
మువ్వన్నల జెండాను ఎగరవేస్తున్న బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు జైన్‌

ఏసీసీ, సెప్టెంబరు 17: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు జైన్‌ అన్నారు. అర్చన టెక్స్‌  చౌరస్తాలో జాతీయ జెండాను ఎగురవేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల విముక్తి  కలిగించిన ఘనత సర్దార్‌ వల్లాభాయ్‌పటేల్‌కు దక్కుతుందన్నారు.    ప్రధాని సూచన మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా విమోచన దినోత్సవాన్ని కేంద్రం తరుపున అధికారికంగా నిర్వహించడం ప్రజల అదృష్టమన్నారు. సిసోడి యా, వెంకటేశ్వర్‌రావు, ఆంజనేయులు, సతీష్‌రావు, కృష్ణ, శ్రీదేవి పాల్గొన్నారు

మందమర్రిటౌన్‌: అన్నదానాల్లోకెల్లా రక్తదానం గొప్పదని పెద్దపల్లి పార్లమెంట్‌  బీజేపీ కో కన్వీనర్‌ నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి అందు గుల శ్రీనివాస్‌లు తెలిపారు. ప్రధాని జన్మదినం సందర్భంగా ఎంవీటీసీ కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. పట్టణాధ్యక్షుడు చప్పిడి నరేష్‌, నాయకులు మహంకాళి శ్రీనివాస్‌, అక్కల రమేష్‌, ఓరుగంటి సురేందర్‌, దుర్గరాజ్‌, కొంతం రాజు, నగేష్‌, గడ్డం శ్రీనివాస్‌, పాల్గొన్నారు. 

కాసిపేట: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని బీజేపీ జిల్లా కోశాధికారి అట్కపురం రమేష్‌ రక్తదానం చేశారు. సెప్టెంబరు 17ను విమోచన దినంగా జరుపుకోవాలని ఆయన పేర్కొన్నారు. బీజేపీ నాయకులు పాల్గొన్నారు. 

జన్నారం: తెలగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.  అనంతరం ప్రధాని మోదీ జన్మదిన వేడుకలను నిర్వహించి కేక్‌ కట్‌ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు.  తమ్మినేని శ్రీనివాస్‌,  చందు, హరినాయక్‌, సురేష్‌, కొమురయ్య, కృష్ణ, తిరుపతి, మురళి పాల్గొన్నారు.

బెల్లంపల్లి: ప్రధానమంత్రి నరేంద్రమోదీ పుట్టిన రోజు వేడుకలను బీజేపీ నాయకులు నిర్వహించారు. అగర్వాల్‌ భవనంలో రక్తదాన శిబిరం నిర్వహించా రు. పెద్దపల్లి పార్లమెంట్‌ బీజేపీ కన్వీనర్‌ మల్లికార్జున్‌, కో కన్వీనర్‌ వెంకటేశ్వర్లు గౌడ్‌, నాయకులు వెంకటకృష్ణ , తదితరులు పాల్గొన్నారు. రాంజీగోండు ఆవాసం లో ప్రధాని జన్మదిన వేడుకలను నిర్వహించారు. బెల్లంపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జీ కొయ్యల ఏమాజీ విద్యార్థులతో కలిసి కేక్‌ కట్‌ చేశారు. తిరుపతి, గోవర్ధన్‌, శ్రీనివాస్‌, శేషుకుమార్‌, నాగరాజు,నర్సింగ్‌ తదితరులు పాల్గొన్నారు. 

దండేపల్లి: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని మండల కేంద్రంతోపాటు పలు గ్రామాల్లోని బీజేపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. పార్టీ మండల అధ్య క్షుడు గోపతి రాజయ్య జాతీయ జెండాను ఎగురవే శారు.  

మందమర్రిరూరల్‌: సారంగపల్లిలో బీజేపీ మండల అధ్యక్షుడు పైడిమల్ల నర్సింగ్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

నెన్నెల: బీజేపీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుకు న్నారు. ఆ పార్టీ మండల అధ్యక్షుడు టి. శైలేందర్‌సింగ్‌  బస్టాండ్‌ వద్ద జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. హరీష్‌గౌడ్‌, సర్పంచ్‌ తోట సుజాతశ్రీనివాస్‌, ఉపసర్పంచ్‌ అంజన్న  పాల్గొన్నారు. 

Read more