ఏజెన్సీలో ఉచిత వైద్య సేవలకు కృషి

ABN , First Publish Date - 2022-03-05T07:02:39+05:30 IST

ఉమ్మడి జిల్లాలోని గిరిజన ప్రాంతాల ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందుబాటులో తేవడానికి ప్రభుత్వం కృషి చేస్తున్నందున అధికారులు, వైద్యులు ఉట్నూర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే రోగులకు తక్షణ వైద్య సేవలు అందించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు.

ఏజెన్సీలో ఉచిత వైద్య సేవలకు కృషి
ఉట్నూర్‌ ఆస్పత్రిలో మాట్లాడుతున్న మంత్రి హరీష్‌రావు

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు 

ఉట్నూర్‌ సివిల్‌ ఆస్పత్రి సందర్శన 

మంత్రికి ఆయా మండలాల ప్రజాప్రతినిధుల వినతులు

ఉట్నూర్‌, మార్చి 22: ఉమ్మడి జిల్లాలోని గిరిజన ప్రాంతాల ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందుబాటులో తేవడానికి ప్రభుత్వం కృషి చేస్తున్నందున అధికారులు, వైద్యులు ఉట్నూర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే రోగులకు తక్షణ వైద్య సేవలు అందించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. శుక్రవారం స్థానిక సివిల్‌ ఆస్పత్రిని   సందర్శించి వైద్య సేవలను పరిశీలించిన అనంతరం అధికారులు, వైద్యులతో మాట్లాడారు. ఆస్పత్రిలో కావాల్సిన పరికరాల న్ని సమకూరుస్తామని, అవసరమైన నర్సింగ్‌ సిబ్బందిని నియమిస్తామని అన్నా రు. ప్రస్తుత మరమ్మత్తుల కోసం ఎన్‌ఆర్‌హెచ్‌ఎం నిధులను వినియోగించుకోనేలా కలెక్టర్‌ వినియోగించుకోవాలని ఆదేశించారు. ఐటీడీఏ పీవో నేతృత్వంలో మరమ్మతుల పనులతో పాటు ఆస్పత్రి నిర్వహణ విషయాలు చేసుకోవాలన్నారు. ఆస్పత్రిలోని శవాల గదికి రెండు రిఫ్రిజిరేటర్లను అందిస్తామని అన్నారు. ప్రస్తు తం ఇద్దరు స్త్రీ వైద్య నిపుణులు ఉన్నప్పటికి మరో ఒకరిని నియమిస్తామని, ము గ్గురు కూడా ఉట్నూర్‌ ఆస్పత్రిలోనే  మహిళ రోగులకు సేవలు అందించాలని ఆదే శించారు. రిమ్స్‌లో డిప్యూటేషన్‌తో పని చేస్తున్న డాక్టర్ల డిప్యూటేషన్‌లను రద్దు చేస్తున్నామని, ప్రతీఒక్కరి ఉట్నూర్‌ ఆస్పత్రిలోనే రోగులకు అందుబాటులో ఉం టూ వైద్యం అందించాలని అన్నారు. ఉట్నూర్‌ ఆస్పత్రి  రెఫరల్‌ ఆస్పత్రి కాదని, ఆస్పత్రికి వచ్చే రోగులందరికి సరైన వైద్యం అందించి నయం చేయాల్సిన బాధ్య త డాక్టర్లపై ఉందన్నారు. ఆస్పత్రిలో పిల్లల వైద్యం కోసం పిల్లల డాక్టర్లను కూడ నియమిస్తున్నామన్నారు. ఆశాలు, ఏఎన్‌ఎంల సేవలు సద్వినియోగం చేసుకుంటున్నామని అన్నారు. వారి సమస్యలను సానుకూలంగానే పరిష్కరిస్తామన్నారు. ఉట్నూర్‌ ఆస్పత్రిని వంద పడకల ఆస్పత్రిగా అభివృద్ది చేస్తామని ఖానాపూర్‌లో వంద పడకల ఆస్పత్రిని మంజూరు చేయడానికి హమీ ఇస్తున్నామన్నారు. శ్యాం పూర్‌ పిహెచ్‌సీ మరమ్మత్తులు  చేస్తామన్నారు. ఉట్నూర్‌ ఆస్పత్రిలో అవసరమైన ఆపరేషన్‌లు, సీజిరియన్‌లు చేపట్టాలని అన్నారు. జిల్లాలో 60 శాతం మంది రోగులు ప్రైవేటు వైద్యం వైపు మొగ్గు చూయిస్తున్నారంటే ప్రభుత్వ వైద్యం అందడం లేదా అని ప్రశ్నించారు. ప్రభుత్వ వైద్యమే వంద శాతం అం దుకోనేల కృషి చేయాలని అన్నారు. ఇందులో మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంఎల్‌సీ దండే విఠల్‌, ఎమ్మెల్యే రేఖానాయక్‌, కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌, జడ్పీ చైర్మన్‌ రాథోడ్‌ జనార్దన్‌, ఐటీడీఏ పీవో అంకిత్‌, ఆర్డీవో జాడి రాజేశ్వర్‌, తహసీల్దార్‌ సతీష్‌కుమార్‌, ఎడీఎంహెచ్‌వో డాక్టర్‌ మనోహర్‌, సూపరిండెంట్‌ డాక్టర్‌ ఉపేందర్‌, ఎంపీపీ పంద్ర జైవంత్‌రావు, తదితరులు పాల్గొన్నారు.

‘30 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేయాలి’

జైనథ్‌: మండల కేంద్రంలో 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని జడ్పీటీసీ తుమ్మల అరుందతి వెంకట్‌రెడ్డి, నాయకులు శుక్రవారం రాష్ట్ర వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి అన్నీరు హారీష్‌రావుకు శుక్రవారం వినతి పత్రాన్ని అందజేశారు. దీంతో పాటు జైనథ్‌ మండల కేంద్రంలో మినిస్టేడియం నిర్మించడంతో పాటు బీసీ రెసిడెన్షియల్‌ కళాశాల నిర్మాణానికి నిధులు కేటాయించాలని విన్నవించారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగురామన్న, రైతు సమన్వయ సమితి మండల కో ఆర్డినేటర్‌ ఎస్‌.లింగారెడ్డి, తదితరులున్నారు.

‘పీహెచ్‌సీని ఏర్పాటు చేయండి’

సిరికొండ: మండలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని మేజర్‌ సర్పంచ్‌ ఒరగంటి నర్మదపెంటన్న శుక్రవారం ఇంద్రవెల్లిలో రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌ రావుకు వినతిపత్రం అందజేశారు. మండలంలోని మొత్తం 19 గ్రామ పంచాయతీ ఉన్నాయని తెలిపారు. ఇక్కడ అధిక శాతం మంది ప్రజలు ఆదివాసీ గిరిజనులు ఉన్నారని తెలిపారు. వైద్యం కోసం ఆదివాసీ గిరిజన గ్రామాల  ప్రజలు వైద్యం కోసం ఇక్కడి నుంచి ఇతర మండలాలైన ఇంద్రవెల్లి, ఇచ్చోడకు వెళ్లి వైద్యం చేసుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యం కోసం అధికంగా ఖర్చు చేయడమే కాకుండా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, ఆలాగే సమయానికి వీరికి వైద్యం అంద కుండా ప్రాణాపాయ స్థితి లో ఉంటున్నారని తెలిపారు. కాగా, మంత్రికి సమస్యను వివరించడంతో ఆయన సానుకూలంగా స్పందించి పరిశీలిస్తామని తెలిపారు.

‘ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించరూ!’

ఆదిలాబాద్‌ టౌన్‌: తెలంగాణ వైద్య ప్రజారోగ్య ఉద్యోగుల సంఘం హెచ్‌1 ఉద్యోగులు తమ సమస్యలు పరిష్కరించాలని శుక్రవారం రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హారీష్‌రావును కలిశారు. ముందుగా పూలమొక్కను మంత్రికి అందించిన జిల్లా అధ్యక్షుడు బండారికృష్ణ ఉద్యోగుల సమస్యలను మంత్రికి వివరించారు. పారామెడికల్‌ ఉద్యోగులకు ప్రమోషన్లు, జీవో 317లో జరిగిన జోన్లలో లోకల్‌ క్యాడర్‌లో మార్పుల్లో భాగంగా నష్టపోయిన ఉద్యోగులకు సరైన న్యాయం చేయాలని, ఖాళీలను భర్తీ చేసి ఉద్యోగుల పై పనిభారాన్ని తగ్గించాలని కోరారు. అదేవిధంగా కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగ్యూలర్‌ చేయాలని, ఎన్‌హెచ్‌ఎంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది అందరికి పీఆర్సీ వర్తింప చేయాలని కోరారు. ఇందు లో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సత్యనారాయణ, సలహాదారుడు బాబులాల్‌, కోశాధికారి అనిల్‌, జోనల్‌ నాయకులు అల్లాడి రఘురామరావు, రమణచారి, అక్బర్‌, నగేష్‌, మోహన్‌, ప్రవీన్‌, రాజారెడ్డి, తదితరులున్నారు.

Updated Date - 2022-03-05T07:02:39+05:30 IST