గోండి భాష సమ్మేళనం ఏర్పాటుకు కృషి

ABN , First Publish Date - 2022-11-02T00:03:15+05:30 IST

శతాబ్దాలుగా గోండులు మాట్లాడుతున్న గోండి భాషకు మరింత ప్రాచూర్యం తీసుకురావడానికి గోండి భాషా సమ్మేళనం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఐటీడీఏ పీవో వరుణ్‌రెడ్డి అన్నారు.

గోండి భాష సమ్మేళనం ఏర్పాటుకు కృషి

ఉట్నూర్‌, నవంబర్‌ 1: శతాబ్దాలుగా గోండులు మాట్లాడుతున్న గోండి భాషకు మరింత ప్రాచూర్యం తీసుకురావడానికి గోండి భాషా సమ్మేళనం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఐటీడీఏ పీవో వరుణ్‌రెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక కుమ్రం భీం ప్రాంగణంలోని పీఎంఆర్సీ సమావేశ మందిరంలో నేషనల్‌ బుక్‌ ట్రస్ట్‌ ఇండియా, మహిళా శిశుసంక్షేమ శాఖ, ఐటీడీఏ సంయూక్తంగా నిర్వహించిన గోండి, తెలుగు అనువాద కార్యశాల కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. తల్లిదం డ్రులు పిల్లలకు పుస్తకాలు చదవాలని చెప్పడంతో పాటు అలవాటుగా మార్చాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలతో పాటు ప్రాథమిక స్థాయి విద్యా ర్థులకు గోండి, తెలుగు అనువాద పుస్తకాలు ఏర్పాటు చేయడం ద్వారా విద్యా అభివృద్ధి మరింత వేగంగా జరుగుతుందన్నారు.ఐఏఎస్‌ అధికారి వాడ్రేవు చిన్నవీరభద్రుడు మాట్లాడుతూ 80 ఏళ్ల క్రితం తమ ఉనికి కోసం గోండు వీరుడు కుమ్రం భీం తిరుగుబాటు చేశారన్నారు. దేశ వ్యా ప్తంగా 645 గిరిజన తెగలు ఉన్నాయని, ఒకోక్క తెగకు ఒక భాష ఉం డడం వల్ల ఒకరికోకరికి సంబంధాలు లేకుండా పోయాయన్నారు. దేశం లో బిల్‌ తెగ ప్రథమ స్థానంలో ఉండగా గోండులు రెండో స్థానంలో ఉ న్నారని, 130 లక్షల మంది గోండుల జనాభా ఉందన్నారు. సంతాల తెగ సాహిత్యం గుర్తింపు తెచ్చుకున్న విధంగా గోండు తెగ సాహిత్యంలో ముందుకు రాలేదన్నారు. ప్రపంచ భాషల్లో తెలుగు భాష 15వ స్థానంలో ఉందన్నారు. మూడు దశాబ్దాల క్రితం ఆదిలాబాద్‌ రచయిత వసం త్‌రావు దేశ్‌పాండే రచించిన అడవి నవలను గోండి, కొలాం భాషలలో గోండుకవులు రాసిఉంటే బాగుండేదన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో నేషనల్‌ బుక్‌ ట్రస్ట్‌ ఇండియా తెలుగు సంపాదకులు పత్తిపాక మోహన్‌, బిఎడ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ మెస్రం మనోహర్‌తో పాటు సురేష్‌, రామోహన్‌రావు, వసంత్‌రావు దేశ్‌పాండే, సంగీత, అర్క ఇందిరా, ఏటీడీవో క్రాంతి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-02T00:03:16+05:30 IST